అవధాన శిరోమణి కాశీకృష్ణాచార్యులు గారిని చూడడంతోనే కారణజన్ములు అని అనిపించేదట. ఆయన ఓ మహాసంస్థ. సాహిత్యం, తర్కం, వేదాంతం, గణితం, ఇత్యాది శాస్త్రాలు ఆయనకు కొట్టిన పిండి. హాస్యం వీరి అభిమాన రసపోషణ. ప్రకృతి చికిత్స అంటే ఆయనకు పరమాదరం.
ఓసారి ఆయనను మీరు ద్వైతులు కదా ...అలంకారికులందరూ అద్వైతులు. వారి అద్వైతపరమైన రస స్వరూపనిరూపణలో ఎలా ఏకీభవిస్తారు అని ప్రశ్నించారు.
అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు –
నేను ద్వైతిని. ఇతరులనూ నేను ద్వైతులుగానే అనుకుంటాను. శంకరాచార్యులవారు ద్వైతే అని ఆయమ అభిప్రాయమన్నారు.
అప్పుడు ఆయన చెప్పిన పద్యం ...
ద్వైతము లుబ్ధసుఖద, మ
ద్వైతము తస్కర సుఖప్రదంబు, విశిష్టా
ద్వైతము యాత్రిక సుఖదము,
భూతలమున మొత్తమునకు మూడును మెరుగే.
---------------------------------
కృష్ణాచార్యులు ద్వైతి;- - యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి