న్యాయాలు-605
ప్రతి బింబ న్యాయము
****
ప్రతిబింబం అంటే ప్రతి ఫలనం, ప్రతి ఫలించుట,పోలిక అనే అర్థాలు ఉన్నాయి. అద్దంలో చూసుకుంటే కనిపించేదే మన ప్రతి బింబం.
దీనినే భౌతిక శాస్త్ర పరంగా కాంతి పరావర్తనం అంటారు. సమతల దర్పణంలో కాంతి పరావర్తనం చెందడం వలన ప్రతిబింబం ఏర్పడుతుంది.
అయితే దీనినే శాస్త్రీయ దృక్పథంతో చూస్తే ఒక కాంతి లేదా వేడిని తిరిగి ప్రసారం చేయడం, ప్రతిబింబించడం లేదా తిరిగి ఇవ్వడం లేదా చిత్రాన్ని చూపించడం.. అనగా ఒక చిత్రం ప్రతి రూపం.అద్దంలో ఏదైనా అక్షరం లేదా చిత్రాన్ని అద్దంలో చూసినప్పుడు కుడి,ఎడమలుగా మార్పు చెందిన ప్రతిబింబం ఏర్పడుతుంది.ఇలా అద్దంలోనూ, కదలని నీటిలోనూ, ఏదైనా ఉపరితలంలోనూ మనల్ని గానీ, వస్తువు మరేదైనా చూసే చిత్రము.
అయితే దీనిని వ్యక్తులకు వర్తింపజేసి చూసినట్లయితే వచ్చే లోతైన అర్థం ఏమిటంటే...వ్యక్తిగతమైన లేదా వృత్తిపరమైన ఏదైనా అనుభవం యొక్క ప్రతి అంశాన్ని,వ్యక్తిగా తన ఉనికిని,వృత్తి పరంగా చేయాల్సిన బాధ్యతను నిలుపుకొని నిబద్ధతా రూపంగా చూపడం.
అనగా హృదయగతమైన ప్రతిబింబాన్ని ఎలా ఆవిష్కృతం చేసుకోకు కోవడం,మరి ఎలా ఆవిష్కృతం చేసుకోవాలో తెలుసుకుందాం.
మన హృదయ సంస్కారాన్ని బట్టి హృదయ ప్రతిబింబం ఆవిష్కృతం అవుతుందని తెలుసు.ఆ సంస్కారం అనేది మనలోని మానవీయ విలువలతో కూడిన ఆలోచనా విధానం.అది మన ప్రవర్తన,చేసే పనులు ఆశయాల రూపంలో, ధ్యానం ద్వారా వచ్చిన తేజస్సు, స్థితప్రజ్ఞత ద్వారా ప్రతిబింబింప బడుతుంది.
అలా ప్రతిబింబించేలా చేసే వ్యక్తికి, వ్యక్తిగానూ , వ్యక్తిత్వం వల్లనూ కలిగే ఉపయోగాలు చాలానే ఉంటాయి.తనలోని మంచితనాన్ని ,మానవీయతను ఇంకా లోని గొప్ప అభ్యాసకుడిని,పరిశోధకుడిని, కవిని, రచయితను ఇలా అనేక కోణాల్లో ఈ ప్రతిబింబం బయటి ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
ఈ సందర్భంగా మన పెద్దలు చెప్పిన ఆంగ్ల సామెతను గుర్తు చేసుకుందాం." Face is the index of mind"అంటే కోపం, భయం, ప్రేమ లాంటి లోలోపలి ఉద్వేగాలను ముఖం ప్రతిబింబించేలా చేస్తుంది" అంటారు.
మరి ఈ"ప్రతిబింబ న్యాయము" ప్రకారం మన మనసులో సంకల్పించిన ఉన్నతమైన ఆశయాలు, హృదయ ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా మన చేతలు,రాతలు, ప్రవర్తన ఉండేలా చూసుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి