జీవితం చాలా విచిత్రమైనది తనకు ఏది ఉన్నదో దానిని పూర్తిగా అనుభవించడం చేతకాదు ఏది లేదో దానిని గురించిన తాపత్రయం మాత్రం విపరీతంగ బాధను పెంచుతుంది ఏది దుఃఖము ఏది బాధో తెలియని స్థితి ఉన్నదాని విలువ తెలుసుకోవాలి లేని దాని కోసం తాపత్రియ పడకూడదు అని పెద్దలు చిన్నతనంలోనే పిల్లలకు తెలియజేయాలి పిల్లలు చిన్నతనంలో తమకేది కావాలో తెలియని వయస్సులో నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో గారాబంగా వారు అడిగినవన్నీ తెచ్చిస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది తాను ఏది కోరాడో ఆ వస్తువు విలువ తనకు తెలియకుండా పోతుంది అందుకని మన పెద్దలు చెబుతూ ఉంటారు చిన్నతనం నుంచి కష్టం విలువ తెలిసేలా పెంచాలి అది పెద్దల బాధ్యత.ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారిపై ఎక్కువగా గారాబం చూపటం సహజం దానివల్ల ఆ బిడ్డ ఆలోచన స్థితిని కోల్పోతుంది అన్నీ తెచ్చి పెడుతూ ఉంటే తనకు కావలసినది ఏదో తనకు తెలియకుండా పోతుంది అబ్దుల్ కలాం లాంటి వారు చిన్నతనం నుంచి కష్టాలను అనుభవించి తాను పొందవలసిన విజ్ఞానాన్ని స్వయంకృషితో పైకి వచ్చినవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో ఆలోచించండి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు నుంచి దేశాన్ని చక్కగా పరిపాలించిన అనేకమంది మేధావి వర్గం కష్టం లో నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వారే ఎక్కువ అలాంటి వారికి దుఖం సుఖం సమానంగానే అనిపిస్తాయి కనుక వారి అనుభవాలను మనం నిజ జీవితంలో పాటించినట్లయితే వారిలాగా పెరగడానికి అవకాశం ఉంటుంది.నా బిడ్డ అందరిలా ఎండలో తిరిగి నల్లబడకూడదు తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రతి వారితోనూ కలిసి తిరగకూడదు తమ స్థాయికి తగినవారిని మాత్రమే ఎంచుకోవాలని ఆంక్షలు పెట్టే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నంతవరకు బిడ్డల భవిష్యత్తు బాగుపడదు అన్న విషయం స్పష్టం సాయంత్రం పూట ఎండలో తిరిగితే ఆ ఎండలో ఉన్న డి విటమిన్ అతని శరీరాన్ని బాగు చేస్తుంది అన్న విషయం తండ్రికి తెలుసా దాని కొరకైనా బీదవాడైనా ఎదుటివాడితో.
స్నేహంగా కలిసి మెలిసి ఉంటే పిల్లలు ఎంత ఆనందంతో ఉంటారు తల్లిదండ్రులకు తెలుస్తుందా చిన్న తరగతులలో ఉన్నప్పుడు ఇంట్లో తయారు చేసిన చిరుతిండిని తల్లికి తెలియకుండా దొంగతనం గా తీసుకొని వెళ్లి తన స్నేహితులకు ఇస్తూ ఉంటే ఒకే పదార్థాన్ని ఇద్దరు కాకి ఎంగిలి అంటే ఆ పదార్థాన్ని తన చొక్కా లో పెట్టి నోటితో కొరికి ఎంగిలి కాకుండా చేయడం కాకి ఎంగిలి అని అంటారు ఆ ఆనందం ఏమిటో ఆ పిల్లవాడికి తెలుస్తుంది తల్లిదండ్రులకు ఎలా అర్థం అవుతుంది.
================================
సమన్వయం ; డా . నీలం స్వాతి
వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి