మేము నటులంకాం
కానీ
మాతో ఎవరైనా నటిస్తే చాలు
తడబడకుండా జీవిస్తాం
జీవితమంతా బ్రతికేస్తాం!!
మళ్లీ మళ్లీ జన్మిస్తాం!!!?
మనల్ని మనం మర్చిపోయి
జీవిస్తున్న భూమి వాసులం మనం!
ఇంత విశ్వంలో
మనం ఉన్నామని తెలిస్తే
మనమెంత తక్కువ ఎంత గొప్పవాళ్ళమో తెలుస్తుంది.!!!
మీ ప్రయోగాల కోసం
మీ పరిశోధనల కోసం
ఉపయోగించబడ్డ
వింత జంతువులం కాం మేం
మంచి మనుషులం మేం!!!!?
ఎనిమిది నిమిషాల క్రితం
సూర్యుడు పంపిన ఫోటోలను చూస్తున్నాం.!!
కానీ లక్షల కోట్ల కాంతి సంవత్సరాల క్రితం నక్షత్రాలు పంపిన ఫోటోల సంగతేమిటి.!!?
మనల్ని మనం చూసుకునేందుకు ఇదేమన్నా అద్దామా.!!?
ఇది ఒక అబద్ధం ఒక నిజం!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి