కాలం ; -. ఆనుసృజన -జయా)
మనం వేచి ఉన్నప్పుడు 
కాలం నెమ్మదిగా కదులుతున్నట్లనిపిస్తుంది

మనం ఆలస్యం అయినప్పుడు 
కాలం వేగంగా 
కదులుతున్నట్లనిపిస్తుంది

మనం విచారంగా ఉన్నప్పుడు 
కాలం దారుణమైనదిగా అన్పిస్తుంది

మనం సంతోషంగా ఉన్నప్పుడు 
కాలం తక్కువైనట్టు అన్పిస్తుంది 

మనం బాధలో ఉన్నప్పుడు 
కాలం అంతులేనిదిగా అన్పిస్తుంది

మనం విసుగ్గా ఉన్నప్పుడు
కాలం చాలా బరువుగా అన్పిస్తుంది

ప్రతిసారీ, కాలం 
మన భావాలు
మన మానసిక పరిస్థితులపై
ఆధారపడుతుంది
అంతేతప్ప
గడియారాల ద్వారా కాదు, 
కనుక ఎల్లప్పుడూ కాలాన్ని
ఉనచనతంగా గడుపుదాం

కాలం విలువైనది
కాలం అవశ్యమైనది 
కానీ మనం దానిని మరచిపోయి
వృధా చేసుకుంటాం


కామెంట్‌లు