తల్లిపాల వారోత్సవాల సందర్బంగా వెంకటాపురంలో జరిగిన కార్యక్రమంలో శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ అధ్యక్షురాలు డా.కుప్పలి కీర్తి పట్నాయక్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కీర్తి ఆధ్వర్యంలో గర్భిణి స్త్రీలకు ఆరోగ్యసూత్రాలపై అవగాహన, సీమంతాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిడిపివో రమణికుమారి, అధికారిణి శ్రీలత, సూపర్ వైజర్ జ్యోతి, స్థానిక బి.సి.కోలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామరాజు, అంగన్వాడీ కార్యకర్తలు సూర్యకళ, రమణమ్మ, శ్రావణి, నాగాంబిక, ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ చేస్తున్న సేవలకు కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. తొలుత కీర్తి పట్నాయక్ అందరికీ ఉచితంగా చీరలు, గాజులు, ఫలతాంబూలాలను పంపిణీ గావించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి