బుద్ధుని మహా పరి నిర్వాణం ;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 అప్పుడు భిక్షువు సంఘం స్థవిరులు స్థవిరుడు వాటిని సరిగానే అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవచ్చు ఈ నాలుగు రకాల అతి ముఖ్యమైన సందేశాలను మీరు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలని బుద్ధుడు చెప్పాడు భోగనగరంలోని ఆనంద చైత్యంలో ఉన్నప్పుడు బుద్ధుడు తరచూ భిక్షువు లతో అలాంటి శీల సమాధి ప్రజ్ఞలు ఎన్నో ధార్మిక ఫలితాలను ఇస్తాయని తద్వారా కృష్ణ త్రయం మిధ్యా దృష్టి అ విద్యల నుంచి పూర్తిగా విముక్తులు కావొచ్చు అని బోధించాడు ఇలా భోగనగరంలో కొంతకాలం ఉన్న తర్వాత చుందుడు అనే కంసాలికి చెందిన మామిడి తోటలో విడిది చేశాడు  ఆ మామిడి తోటలోనే బుద్ధుడు విడిది చేశాడన్న సంగతిని తెలుసుకున్న చుంద్రుడు అక్కడికి వెళ్లి బుద్ధునికి నమస్కరించి ఒక ప్రక్కగా కూర్చున్నాడు  బుద్ధుడప్పుడు చుoద్రునికి ధమ్మ సందేశం ఇచ్చాడు బుద్ధుని ప్రసంగానికి ఆనందభరితుడైన చుందుడు భగవాన్ భిక్షు సంఘంతో పాటు తథాగతులు రేపు మా ఆతిథ్యం స్వీకరించాలి  అని వేడుకున్నాడు.బుద్ధుడు మౌనంగా తన అంగీకారాన్ని తెలియజేశారు చుందుడు లేచి బుద్ధుడు కి నమస్కరించి బుద్ధునికి ఎడమవైపు నుంచి బయటకు వెళ్లిపోయాడు  తెల్లవారిన తర్వాత చుందుడు బుద్ధునికి భిక్షు సంఘానికి ఇంటి దగ్గరే రుచికరంగా తయారు చేయించి భోజన వేళకు కొంచెం ముందుగా భోజనాలకు రావొచ్చు అని ఆహ్వానించాడు బుద్ధుడు లేచి దీక్షాపాత్రను చీవరాన్ని తీసుకొని సంఘం వెంటరాగా ఇంటికి వెళ్ళాడు సిద్ధం చేసి ఉంచిన ఆసనం పై కూర్చున్నాడు బుద్ధుడు చుందుడుతో చందా నాకోసం నీవు తయారు చేయించిన పదార్థాన్ని నాకు వడ్డించిన తర్వాత భిక్షు సంఘానికి వడ్డించు అన్నాడు  అలాగే భగవాన్ అని చుందుడు బుద్ధునికి సూకర మద్దనాన్ని సంఘానికి ఇతర భోజన పదార్థాలను వడ్డించాడు.అప్పుడు బుద్ధుడు చుందా నాకు వడ్డించిన భోజన పదార్థం ఇంకా మిగిలి ఉంటే దాన్ని ఎవరికీ ఒడ్డించక ఒక గుంట తీసి అందులో పాతిపెట్టు ఎందుకంటే ఒకవేళ ఈ తరంలోని రాకుమారుడు ప్రజలు భిక్షువులు బ్రాహ్మణులు మారులు బ్రహ్మలు దేవతలతో సహా ఒక తథా గతుడు తప్ప వేరే ఎవరూ దానిని జీర్ణించుకోలేరు కాబట్టి అన్నాడు చుందుడు అలాగేనని మిగిలిన పదార్థాన్ని భూమిలో పాతిపెట్టాడు తర్వాత చుందుడు బుద్ధుని దగ్గరకు వెళ్లి ఒక ప్రక్కగా కూర్చుని ధమ్మ సందేశం విన్న తర్వాత లేచి బుద్ధునికి అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చుందుడు ఇంట్లో భోజనం తిన్న తర్వాత బుద్ధుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు రక్త విరేచనాలు అయ్యాయి రోజురాలు భరించలేని నొప్పులు పుట్టుకొచ్చాయి ఈ విషయం ఎవరితోనూ చెప్పకుండా స్మృతితో ఎరుకతో వాటిని భరించాడు అప్పుడు ఆనందుని పిలిచి కుసి నగర(కుశనార) కు వెళదామని చెప్పాడు.
=========================================
సమన్వయం . డా. నీలం స్వాతి 
కామెంట్‌లు