నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం దేశం లో అరవై కోట్ల మంది ప్రజలు తీవ్ర నీటి కొరతతో బాధపడుతున్నారన్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరిలో ఏటా రెండు లక్షల మంది సురక్షిత త్రాగు నీరు లభించక తత్సంబంధిత వ్యాధులకు గురై మరణిస్తున్నారు. అసురక్షిత నీటి వినియోగం వలన కిడ్నీ వ్యాధులకు గురయ్యే వారి సంఖ్య ఏటా పన్నెండు శాతం పెరుగుతోంది.గత అయిదేళ్ళలో తలసరి మంచి నీరు సరఫరా ఇరవై శాతం తగ్గిపోయింది కాగా సగటున భూగర్భ జలాల మట్టం అరవై సెంటీ మీటర్ల మేరకు పడిపోయింది. అత్యధికంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు,పంజాబ్, కేరళ, కర్నాటకలలో భూగర్భ జల మట్టాలు గణనీయం గా తగ్గిపోయి ప్రమాదకర స్థాయికి చేరాయి. ఈ జలాలలో వున్న విషతుల్యమైన రసాయనాలు, లవణాల కారణం గా ప్రాణాంతక వ్యాధులు ప్రబలడం తో పాటు లిటరుకు శుద్ధి వ్యయం బాగా పెరుగుతుంది.పట్టణాలు విస్తరించడం, పారిశ్రామీకరణ, ఆధునిక జీవన విధానం వలన నీటి వినియోగం ఈ కాలం లో 28 శాతం పెరగగా అందుకు కోసం భూగర్భ జలాలను అవసరానికి మించి తోడేస్తున్నారు. దేశం లో నల్గొండ,కరీం నగర్ లతోసహా 315 జిల్లాలలోభూగర్భ జలాలలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా వున్నందున వాటిని వినియోగించేవారు ఫ్లోరోసిస్, మూత్ర పిండాల వ్యాధులు, అస్టియోపోరోసిస్ వంటి భయంకర వ్యాధులతో బాధపడుతున్నారు. జాతీయ వైద్య సలహా మండలి తాజా సర్వే ప్రకారం ప్రస్తుతం దేశం లో అసురక్షిత నీరు కారణం గా పై వ్యాధులతో బాధపడుతూ క్షణం క్షణం నరకయాతన అనుభీవించేవారి సంఖ్య పన్నెండు లక్షల మంది కాగా ఏటా 80-90 వేల మంది కొత్తగా సదరు రోగుల జాబితాలో కొత్తగా చేరుతున్నారు. వీరు కాకుండా 12 లక్షల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులలో అసురక్షిత త్రాగు నీరు కారణం గా 45 శాతం అదనంగా వున్నారు. దేశం లో కలుషిత నీరు కారణం గా ఏటా మూడు లక్షల మంది బాల బాలికలు 10 సంవత్సరాల లోపు వారు అర్ధాంతరం గా మరణిస్తున్నారు. కలుషిత నీఇరు వలన రోగాల బారిన పడిన వారి సంఖ్యాపరం గా ప్రపంచ దేసాలలో మన దేశం 12 వ స్థానం లో వుండడం మన పాలకుల నిర్లక్ష్యమే అని చెప్పక తప్పదు. 2025 నాటికి ప్రధాన నగారాలు, మధ్యస్థ నగరాలలో 10 కోట్ల మంది భూగర్భ జలాలు లభించక ఇబ్బంది పడతారని, అసురక్షిత మంచినీటి వినియోగం వలన ప్రాణాంతక వ్యాధుల బారిన పడే వారి సంఖ్య 35 శాతం పెరుగుతుందన్న సదరు నివేదిక ప్రభుత్వాలను తక్షణం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో కర్తవ్యోన్ముఖులను చేయాలి. ఇక మన దేశం లో ప్రధాన నీటి వనరులైన గంగా, యమునా,కృష్ణా, గోదావరి, కావేరి, జేలం , నర్మదా వంటి జీవనదులు తీవ్రకలుషితమైపోయి, మానవాళికి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వేల లక్షల కోట్ల వ్యయం తో ప్రభుత్వం ప్రారంభించిన నమో గంగా పధకం ఇప్పటి వరకు 5 శాతం ఫలితాలను కూడా ఇవ్వలేదు, 245 నగరాలు, 45 వేల గ్రామాలకు జీవనాధారం అయిన పవిత్ర గంగా నది ఇప్పుడు ప్రజల పాలిట మృత్యువుగా మారి ఏటా లక్షలాది ప్రజలను రోగగ్రస్తులను చేస్తోంది. అభివృద్ధి, పారిశ్రామీకరణ పేరిట విధ్వంసకర చర్యలకు మానవులు పాల్పడుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం బాధాకరం. మానవుల అత్యాశకు,విచక్షణారాహిత్య,బాధ్యతారహిత చర్యలకు ఫలితమే నేడు మానవాళిని పట్టిపీడిస్తున్న జల సంక్షోభం.
భూ ఉపరితల జలాన్ని, భూగర్భ జలం తో అనుసంధానం చేయడం, భూగర్భ జలాలను రీ చార్జి చేసేందుకు ఇంకుడు గుంతలు, చెక్ డ్యాం ల నిర్మాణం, చెరువులు, కాలువల పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్ధ్యం పెంచడం, మురికి నీటి శుద్ధి ప్రక్రియ, అటవీ ప్రాంతాల పెంపు, వాల్టా చట్టం కఠినం గా అమలు నీటి పొదుపు,జల వనరుల సంరక్షణ పై విసృత అవగాహనా తో పాటు నీటిని దుర్వినియోగం చేసేవారిపై జరిమానా వంటి కఠిన పద్ధతులను పాటించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సహకారం, సమన్వయంతో చర్య


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి