సుప్రభాత కవిత ; - బృంద
సర్వ జగత్తునూ తండ్రిలా
సంరక్షించాలని  నీమంగా
క్రమం తప్పక ఆగమించి
సంవేదనలు తొలగించే  దైవం!

అద్దం లోని బింబంలా
అనిపించే అఖిల సృష్టీ
అరుదైన మాయయని
అనుకోమని చెప్పే దైవం!

అందరికీ ఆధారమైన
సర్వాంతర్యామిలో భాగమే
సకలజీవులని  తెలిపినా
తెలుసుకోలేని మాయ దైవం

ఆదియే తెలియని
అంతమే ఎరుగని
అంతటా ఆవరించిన
అపురూపమైన శక్తి దైవం

మాయాజాలంలో చిక్కి
మాయకు లోబడి
మాయావిని ఎరుగక
మానవ నేత్రం వెదికే రూపం దైవం.

అజ్ఞానమనే తిమిరం
అధిగమించాలని
ఆశ్రయించాల్సిన గురువు
అనుగ్రహం చూపే త్రోవ దైవం

ప్రతి ఉదయం ప్రభవించి
ప్రపంచాన్ని నడిపించి
ప్రతి జీవికి మరో అవకాశంలా
ప్రభాతాన వెలిగే ప్రభాకరుడే
దైవం.

పెనుచీకటికావల వెలిగే
సిరిజ్యోతికి

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు