తెల్లారే తరలివచ్చి
కళ్ళారా తనను చూసి
ముదమారా తాకి చూచు
తెలి వెలుగుకై ఎదురు చూచు
పువ్వు
గతమేమో ఎరుగదు
కలతంటే తెలియదు
కలలేవీ కనదు...కానీ
కళ కళగా విరియు పువ్వు.
చిన్ని పూలకెంత వరం
నిరంతరం నవ్వమని
ఉన్న నాలుగు క్షణాలు
నిర్మలంగా బ్రతికే పువ్వు.
తన అందం తానెరగదు
తన రూపు చూసుకోదు
తన కున్న సమయమంతా
తనివి తీరా మురియు పువ్వు.
రకరకాల రంగులతో
చుట్టూ ఉన్న పూలన్నీ
జట్టుగానే ఉంటాయి
కొట్టుకునే గుణం లేని పువ్వు.
ఆహ్లాదం పంచడం
ఆనందం పొందడం
అందంగా బ్రతకడం
అంతమాత్రమే తెలిసిన పువ్వు.
స్వార్థమన్నదే లేక
ఈసు అసూయలు రాక
బ్రతకమని మనకు
తెలియ చెప్పే చిన్ని పువ్వు
నవ్వుల పువ్వులు తెచ్చే
నవ్యమైన వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి