వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 శరీరం సుఖంగా ఉండాలంటే  చేతిలో వాహనం ఉండాలి ఇంట్లో ఏసి ఉండాలి  అందరూ తన మాట వినడానికి సిద్ధంగా ఉండాలి  అయితే దీనివల్ల సుఖం ఉంటుందా అంటే  అనుమానాస్పదమే  కారణం అది మనసుకు సంబంధించింది మనసు ప్రశాంతంగా ఉంటే తప్ప ఆ సంతోషాన్ని ఆనందాన్ని మనం అనుభవించలేము  దానికోసం ప్రయత్నించాలి  ప్రస్తుతం నీకున్న స్నేహాలు ఇష్టాలు  బంధుత్వాలను అనవసరంగా పెంచుకోవడం అనేది మంచిది కాదు  మంది పెరిగితే మజ్జిగ పల్చన అయిపోతాయి  మానసిక ఆనందం కావాలి అనుకున్న వాళ్లు కుటుంబంతో సహా నెలకు రెండు నెలలకు వేరే ప్రాంతానికి వెళ్లి కలిసి పనిచేసి రావాలి  ఎప్పుడూ ఇంట్లోనే ఓ మారుమూల మంచం మీద పడుకుని  నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకు నడవడం కూడా మర్చిపోతాం.
జీవితంలో నీవు అనుభవించిన కష్టసుఖాలను కాగితం మీద పెట్టు అది కథా రూపం లో కవిత రూపంలో లేదా వ్యాస రూపంలో దానివల్ల నీకు మానసిక ఉపశాంతి కలుగుతూ ఉంటుంది  ఏ రోజున మనము నేర్చుకోవడం  మానివేస్తాము ఆ రోజునే మానసికంగా మనం మరణించినట్లు లెక్క  రోజు కొత్తగా హుషారుగా ఆనందంగా ఉండాలి అంటే కొత్తగా ఏదైనా  విషయాన్ని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది  నీకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది మీ ధ్యానం నీ కుటుంబం కాదు  విజ్ఞానం ఎంత పెరిగితే  సమాజంలో నీకు అంత గౌరవం ఉంటుంది  జ్ఞానం ప్రతివాడికి పుట్టుకతో వస్తుంది కానీ విజ్ఞానం తన  పుస్తక పఠనం వల్ల  జీవితంలో తనకు జరిగిన సంఘటనల వల్ల  వస్తుంది  నిన్ను నమ్మి నీ స్నేహం కోసం వచ్చిన ఎవరిని నీవు మోసగించవద్దు  దానివల్ల సమాజంలో చులకన అయిపోతావ్.ఐదు సంవత్సరాల తర్వాత బడికి  వెళ్లడం మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది ఆటల విలువ ఏమిటో  తన తోటి పిల్లలతో హాయిగా చక్కగా ఎలాంటి బాధ్యతలు లేకుండా  ఆటల్లో నిమగ్నమైన  క్షణాలు జ్ఞాపకం వస్తే ఎంత బాధగా ఉంటుంది  కాలేజీలో చేరిన తర్వాత  స్కూలులో  చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చి  బాధపడడం  ఏదైనా ఉద్యోగం వచ్చి  అక్కడ చేరి తర్వాత చదువు విలువ ఏమిటో తెలుస్తుంది   ఆరోజు సక్రమంగా చదివి ఉంటే ఈరోజు ఇన్ని కష్టాలు ఉండవు కదా అని  బాధపడవలసి వస్తుంది  ఉద్యోగంలో నుంచి  బయటకు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం విలువ ఏంటో తెలుస్తుంది  అన్నిటికన్నా ముఖ్యం మరణం  పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు కదా  ఆ మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు తెలుస్తుంది జీవితం విలువ  తల్లిని మించిన ఆప్యాయతతో జీవితాన్ని  ఎప్పటికప్పుడు రక్షిస్తూ వచ్చిన భార్య విలువ ఆమె మరణించిన తర్వాత తెలుస్తుంది  ఇది తెలుసుకున్నట్లయితే జీవితంలో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో దానిని సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు