ప్రేమ!!!;-డా.ప్రతాప్ కౌటిళ్యా
 ప్రేమించడానికి ఎవరూ లేనప్పుడు 
ప్రేమించబడటానికి ఎవరూ లేనప్పుడు 
ప్రేమ కథే లేనప్పుడు
ప్రేమను అనుభవించే అవకాశమే లేనప్పుడు 
ప్రేమ కథలు వినాలి 
ప్రేమ కథలు చదవాలి 
ప్రేమ కథలు చూడాలి 
కానీ 
ప్రేమించకూడదు 
ప్రేమించే అవకాశం!! ఇవ్వకూడదు అంటుంది ప్రేమ!!?
మరణం అందరికీ వస్తుంది 
ప్రేమ అందరికీ పుడుతుంది 
అనుభవం అందరికీ ఉంటుంది. 
కానీ 
ప్రేమించడానికి ఎవరూ లేనప్పుడు 
ప్రేమించబడటానికి ఎవరూ లేనప్పుడు 
ప్రేమను అనుభవించే అవకాశం  లేనప్పుడు.!!??
ప్రేమ కథలు వినాలి 
ప్రేమ కథలు చదవాలి 
ప్రేమ కథలు చూడాలి.
కానీ 
ప్రేమించకూడదు!!
ప్రేమించే అవకాశం ఇవ్వకూడదు.!!
అంటుంది ప్రేమ!!?
ప్రియమైన మిత్రుడు అమరేందర్ జ్ఞాపకం. 
డా.ప్రతాప్ కౌటిళ్యా..

కామెంట్‌లు