ఏ శక్తి ఆపలేనిది ఎవరికీ తల వంచనిది నిరంతర ఊపిరి
పీల్చే గాలికి ఊగే ఆకుల స్వేచ్ఛ లయ జీవితం
త్యాగాల మట్టి చిందించిన రక్తం
ఘన చరిత్ర
నిరంకుశ విషగాలుల పరపీడన కోరలు విరిచిన మన చేతన పతాకే స్వాతంత్ర్యం
అల్లకల్లోల మనసున అతలాకుతలం ఒక్కటై దేశం మూల మూల ఎదురొడ్డి పోరాడిన పోరాటం సలిపిన జన యోధులే భారతీయులు
గాలి వీచే పూలతోట స్వేచ్ఛ పరిమళ గీతం
మనిషినీ మట్టిని ప్రేమించే ఆత్మీయ ఆత్మల సమరఫలం
జాతీయ గీతం ప్రేరణలో ఆలపించే
సమైక్య భారతవాని గానమే నిజ స్వాతంత్ర్యం
బతుకుదాం మనుషులుగా జన గణ సంగీతం
కాపాడుకుందాం ఈ స్వేచ్ఛ గాలిని స్వచ్ఛ మనసులతో
మన ఊపిరి నాదమే ఎల్లప్పుడు
మనల మేల్కొల్పే మన స్వాతంత్య్రం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి