తిరువూరు గ్రామంలో తిరుపతయ్య ఓ టీకొట్టు యజమాని వుండేవాడు. అతనికి పక్క ఊరి నుండి రంగయ్య అనే ఓ రైతు పాలుతీసుకొచ్చి పోసేవాడు.
ఓ రోజు అతను పాలు తీసుకురాలేదు. దీంతో తిరుపతయ్య పాలు లేక ఆ రోజు కొట్టు మూసివేశాడు. అయితే జనం అధికంగా రావడంతో అదే ఊరిలో మంగయ్య వద్ద పాలు తెచ్చి టీ కాచి పోశాడు. పాలు ఎక్కువగా చిక్కగా లేకపోవడంతో ఎక్కువ మందికి టీ పోయలేపోయాడు.
ఆ మురుసటి రోజు కూడా రంగయ్య రాలేదు. ఆ రోజు పాలకోసం మంగయ్య వద్దకెళ్లాడు.
సరిగ్గా అదే సమయానికి మంగయ్య పాలలో నీళ్లు అధికంగా కలపడం చూసి అవాక్కయ్యాడు. అతని వద్ద పాలు తీసుకోకుండా వెనక్కి వెళ్లిపోయాడు.
అది చూసిన మంగయ్య ‘‘ పాలు తీసుకోకుండా వెళ్లిపోతున్నావేమయ్యా..?’’ అని ప్రశ్నించాడు.
తిరుపతయ్య అతని వైపు కాస్త అమాయకంగా చూసి ఇంటి దారి పట్టాడు.
మరుసటి రోజు టీకొట్టు తెరవలేదు. ఆరోజు ఉన్నట్లుండి ఓ పెద్ద పెళ్లివారు తమకు టీలు సఫ్లై చేయాలని బతిమలాడడంతో తిరుపతయ్య రంగయ్య వద్దకొచ్చాడు. అప్పటికే రంగయ్య కాపురాన్ని పట్టణానికి మార్చాడని తెలుసుకుని పట్టణానికి బయలుదేరాడు.
అక్కడ ఓ పెద్ద మేడలో రంగయ్య కాపురం వుంటున్నాడు. అతని మేడ చూసి తిరుపతయ్య అవాక్కయ్యాడు. మేడ బయట సెక్యూరిటీ వున్నాడు. అతడిని పిలిచి ‘‘ టీకొట్టు తిరుపతయ్య వచ్చాడు..’’ అని రంగయ్యకు కబురుపంపమన్నాడు.
సెక్యూరిటీ లోపలికి వెళ్లి విషయం చెప్పడంతో టిఫన్ తింటున్న రంగయ్య పరుగున లేచి తిరుపతయ్య వద్దకు వచ్చాడు. అతడిని చూసి ‘‘ పాలు కావాలి..పెద్ద పెళ్లి వారు అడిగారు..’’ అనడంతో రంగయ్య ఎదురుగా వున్న పశువుల పాకలోకి వెళ్లాడు. గేదెల నుండి పాలు పిండి క్యానులో పోశాడు.
తిరుపతయ్య ‘‘ ఇక వస్తా’’ అని చెప్పడంతో తన కథ అంతా చెప్పాడు రంగయ్య.
తనకు ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు వున్నారని, వారిని బాగా చదివించడంతో కూతుళ్లు డాక్టర్లు అయ్యారని, కొడుకులు ఇంజినీర్లు అయ్యి మంచి ఉద్యోగాలు చూస్తూ ప్రజయోజకులయ్యారని చెబుతుంటే తిరుపతయ్య ముఖం చిన్నబోయింది. ఎంతో అణకువతో పాలుపోస్తూ తన వద్దకు వచ్చే రంగయ్య పిల్లలను చదివించి మంచి ప్రయోజకులను చేసినందుకు సంతోషించాడు.
అసలు విద్యేలేని తన పిల్లలను అప్రయోజకుల్ని చేసినందుకు నిరాశతో కుమిలిపోతూ చేతిలో వున్న పాల క్యానుతో విద్యా వినయం ప్రదర్శిస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగినట్లు కన్పించే రంగయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుని టీ కొట్టు వద్దకు వడివడిగా నడిచాడు రెక్కల కష్టాన్ని నమ్ముకున్న తిరుపతయ్య.
విద్యా వినయం!;- - బోగా పురుషోత్తం, తుంబూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి