హెచ్ఐవి మహమ్మారిని దరిరానీయొద్దు
 

హెచ్ఐవి వ్యాధిని దరిరానీయకుండా తగు జాగ్రత్తలు పాటించాలని గెస్ట్ టి.ఐ. ప్రోజెక్ట్ ఓ ఆర్ డబ్ల్యు సూపర్ వైజర్ భూపతి లక్ష్మి అన్నారు. కడుము గ్రామ సచివాలయ ఆవరణలో జరిగిన గ్రామసభా వేదికపై హెచ్.ఐ.వి నిర్మూలన అవగాహనా సదస్సుకు ఆమె ప్రత్యేక ప్రతినిధిగా హాజరై అవగాహన కల్పించారు. డి.పి.ఎం. ఆదిలింగం నిర్దేశాల మేరకు ఆమె ఈ అవగాహన కల్పించారు. వ్యాధి నిర్ధారణకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్క హెచ్.ఆర్.జి. కి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. లైంగిక సంపర్కంలో సురక్షిత కండోమ్ వాడకం తప్పనిసరి అని అన్నారు. కొత్త సూది, సిరంజి, ఉపయోగించాలని, తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సోకకుండా తగు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. జిల్లా ప్రోజెక్టు మేనేజర్ ఆదిలింగం గారి నిర్దేశాలతో మీకు తెలుసా అనే కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన సదస్సును నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యావంతులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు