నాగుల పంచమి నాగన్నా
నీపుట్టకు వత్తుము నాగన్న
పాలు పళ్ళు తెచ్చేము
నీపుట్టకాడ పెట్టేము
కసరకు తలపడగ విసరకు
కాటు వేసి పానాలుతీయకు
నీపుట్టకాడ కొచ్చేము
నీపుట్ట చుట్టూ తిరిగేము
శ్రావణాన వర్షాలతో హర్షాలు
రైతన్నకు నేస్తం నీవెకదన్నా
పురుగు పుట్రా ఎలుకలనించి
పంటలు కాపాడేవు నీవేకదన్నా
పర్యావరణ పరిరక్షణ కై నీవుంటేనే నోటిలోకి మెతుకుకదన్నా
శివుని మెడలో ఆడేవు
గణపయ్య బొజ్జని చుట్టేవు
నీపై పవళించు నారాయణ
తకధిమి తకధిమితో కాళింది పై
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి