ఓటమి లేని వాడికి అనుభవంరాదు
అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు
ఓడినప్పుడు పాఠాన్నిస్వీకరించు
నిజాన్ని మార్చేశక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు
కానీ
ప్రపంచాన్ని మార్చేశక్తి నిజానికి ఉంది.
మనిషి సమాజంలో సూదిలాబ్రతకాలి
కత్తెర లాగా కాదు
సూదిపనిఎప్పుడూ జోడించడమే
కత్తెర పనిఎప్పుడూ విడదీయడమే
అందరినీ కలుపుకుంటూ సూదిలా బ్రతకాలి.
కానీ
కత్తెరలా విడదీయరాదు.
కష్టం అందరికీ శత్రువే
కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతోస్వీకరిస్తే సుఖమైనిన్నుప్రేమిస్తుంది.
ప్రతి ప్రశ్నకు సమాధానం ఒకసమాధానం ఉండి తీరుతుంది
ఒకవేళ సమాధానంలేని ప్రశ్న అయితే సమస్యప్రశ్నదికాదు
ప్రయత్నానిది.
ఎదుటివారి కన్నీళ్లు చూసి నువ్వు ఆనందించాలనుకుంటే
ఆ క్షణమే నువ్వు మనిషిగా మరణించినట్టు లెక్కా
అబద్ధం చెప్పడం శాపం లాంటిది
ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది
నీ ప్రతిబింబం స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది
నీ ఆలోచనల విధానం మీద
నీ భవిష్యత్ స్పష్టత ఆధారపడి ఉంటుంది.
మూర్ఖుడు తాను ఇతరులను మోసం చేయగలుగుతున్నాడు
కాబట్టి తెలివిగల వాణ్ణి అనుకుంటున్నాడు.
అదితన పిచ్చితనమని తన నాశనానికి దారితీస్తుందని గ్రహించడు.
జీవితం అనేది
ఒక ప్రశ్న లాంటిది ఎవరూ సమాధానం చెప్పలేరు.
చావు అనేది సమాధానం లాంటిది.
కానీ
ప్రశ్నిచే ధైర్యం ఎవ్వరికీ ఉండదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి