పంతులమ్మ పాఠాలు;- -గద్వాల సోమన్న,9966414580
బ్రతుకున దిద్దుబాటు
అత్యంత అవసరము
మనసున క్రుంగబాటు
మిక్కిలి హానికరము

ఇహమున సర్దుబాటు
అవుతుంది కీలకము
కోరదు వెసులుబాటు
కష్టించే తత్వము

ఇవ్వాలి తోడ్పాటు
పదిమందికి మహిలో
చేయాలి ఏర్పాటు
మంచి పనికి మదిలో

నీచము వెన్నుపోటు
పొడవరాదు ఎన్నడు
చాలా సిగ్గుచేటు
విడిచిపెట్టు తమ్ముడు


కామెంట్‌లు