చేపలండి చేపలు;- -గద్వాల సోమన్న,9966414580
చేపలండి చేపలు
చెరువులోని చేపలు
నీటి ప్రవాహానికి
ఎదురీదే చేపలు

చిన్ని చిన్ని చేపలు
చక్కనైన చేపలు
గాలానికి చిక్కే
అమాయకపు జీవులు

ప్రాణమున్న చేపలు
పనికి వచ్చు చేపలు
వలవేస్తే దొరుకును
పెద్ద పెద్ద చేపలు

కొవ్వు పదార్థాలే
తక్కువున్న చేపలు
పోషక విలువలున్న
ఆరోగ్యమిచ్చు చేపలు

మతిమరుపు తగ్గించు
శ్రేష్టమైన చేపలు
జ్ఞాపక శక్తి పెంచు
మేలు రకం చేపలు

అందమైన చేపలు
అక్వేరియం చేపలు
నేత్రానందమిచ్చు
అక్వేరియం చేపలు

శ్వాసించే చేపలు
పొలుసులున్న చేపలు
రెక్కలను వాడుకుని
పయనించే చేపలు

ఒత్తిడిని నివారించు
ప్రశాంతత కల్గించు
చేపలతో మేలులు
ఉపాధికి మార్గాలు


కామెంట్‌లు