శివునికి గంగాజలంతో అభిషేకించి ఆపై చందనం పూస్తారు.విభూది మూడురేఖలుగా తీర్చిదిద్దుతారు.ఆకాలంలో దుర్మార్గుడైన రాజు నిషేధించి ఎక్కడా చందనం గంధపుచెక్క దొరక్కుండా చేశాడు. మూర్తి నయనార్ పరమభక్తుడు.తన మోచేతిని సానమీద గంధంచెక్కలాగా అరగదీయసాగాడు.రక్తం కారి కండ ఊడివచ్చినా ఆభక్తుడు తనపని ఆపలేదు. రాజు కుళ్ళికుళ్లి చచ్చాడు. ఆరోజు ల్లో ఓపద్ధతి ఉంది. రాజుచస్తే ఏనుగు కళ్ళకి గంతలు కట్టి తొండంలో పూలదండ ఇస్తే అది ఎవరిమెళ్లో దండవేస్తే వాడే రాజు.ఆఏనుగు భక్తుడైన మూర్తి నయనార్ మెళ్ళో దండేసింది. ఆయన్ని రాజుగా పట్టాభిషేకం చేశారు. "నాకు భస్మం తో అభిషేకం రుద్రాక్షలకిరీటం తలపై పెట్టండి " అని ఆజ్ఞాపించాడు. దైవంని తల్చుకుంటూ ఉంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తాడు.
కొసమెరుపు..
భీమవరం కి దగ్గరలో యనమదుర్రు అనేగ్రామంలో శిరస్సు కింద తలపైన తో శీర్షాసనంతో ఉన్న శివలింగం ఉంది. ఎదురుగా ఉన్న కోనేరులో ని నీటితోనే నేటి కీ స్వామికి ప్రసాదం తయారు చేస్తారు. వేరే నీటితో వండితే బియ్యం ఉడకదు.శివుడు యోగనిష్ఠలో ఉంటే పార్వతీ దేవి కుమారస్వామి కి స్థన్యం ఇస్తుంది అక్కడ. దుర్మార్గులు కత్తి తో లింగం పై కొడితే పగలలేదుకానీ ఆగాటు ఇప్పుడు కూడా శివ లింగంపై కనపడుతుంది. ఆదుర్మార్గులపై అమ్మ రాళ్లు కురిపిస్తే 200మంది పైగా చచ్చారు.
కంచి పరమాచార్య అక్కడకి దగ్గరలో ఉన్న మందపాకక్షేత్రం ని కూడా దర్శించుకున్నారు. అమ్మ వారి నెత్తిపై పూలపాత్ర ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం 12కి పూలపాత్ర తనంతట తాను ఒరిగి విగ్రహాన్ని పూలతో అభిషేకం చేయటం మహా అద్భుతంగా ఉంటుంది నేటికీ 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి