నువ్వు..హీరోవోయ్...!
నీ జన్మ సార్ధక మై0ది..!
తెర మీద నీ బొమ్మ తళ తళ
మెరిసి పోతోంది...!
నువ్వంటే గొప్ప క్రేజుందోయ్!!
నీ కెందరభిమానులోయ్ ...
నేనేంటి హీరో నేంటి అనుకుం టున్నావా...?!
ఏంటి నువ్వందంగాలేవని అనుమానిస్తున్నావా ...
ఆరడుగుల అందగాడిని కానే
అని సంకోచిస్తున్నావా...
నీకు సిక్స్ పేక్ లేదని, కనీసం ఒక్కడితో నైనా ఫైట్చెయ్యలేనని బాధపడుతు న్నావా...
డాన్స్లు స్టెప్లు రావని దిగులు చెందు తున్నావా....
నిన్నెగతాలిగా హేలన చేస్తు న్నాననుకుంటున్నావు కదూ!
లేదు... నేను సత్యమే చెబుతున్నాను..!
నీ అందమెవడికి కావాలోయ్
ఎదురైన సమస్యలతో నువ్వెంత పోరాడి , నిలిచిగెలిచావని..!
నీ దయ, ప్రేమ, జాలి, సేవ
ఎంత మంది బ్రతుకుల్లో ఆనం దాలు చిందించిందని...!
దేనికీ వెరవక , నువ్ బ్రతుకుతూ, నీ చుట్టూ ఉన్న వారికి బ్రతుకు నిస్తూ , ఎందరి మనసులు దోచుకున్నావని...
నీ కంటే గొప్ప యే సినిమా హీరో కాగల డోయ్... !
వా లందరూ నటించారోయ్
నువ్ జీవించావ్...!
నువ్వేనోయ్ రియల్ హీరో !!
ఈ సమాజ తెరపై నిజమైన హీరోవి...!
నీకే పద్మశ్రీలు,ఆస్కార్లాంటి అవార్డులు రాక పోతేనేమ్....
యూ ఆర్ ద రియల్ హీరో!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి