పరమశివుని కి చంద్రశేఖర శశిశేఖర అనే పేర్లు ఎలా వచ్చాయో తెల్సా? దక్షుడు తన కూతుళ్ళు అశ్విని మొదలు రేవతి దాకా అందరినీ చంద్రుని కిచ్చి పెళ్లి చేస్తాడు.కానీ చంద్రుడు రోహిణి అనే భార్యపై ఎక్కు వ మక్కువ కల్గి ఉంటాడు.అందరు కూతుళ్ళు దక్షుని తో " నాన్న! మాభర్త మమ్మల్ని పట్టించుకోకుండా రోహిణి తో ఉంటున్నారు.మాగొంతుకోశావు " అని గగ్గోలు పెట్టడం అల్లుడ్ని"క్షయ రోగంతో కృశించి పో" అని శపించాడు. చంద్రుని తో బాటు కుమార్తెలు లబలబలాడటంతో" చంద్రా! 15 రోజులు వృద్ధి 15 రోజులు క్షీణత లో ఉంటావు" అని దక్షుడు అనుగ్రహించాడు.అదేశుక్లపక్షం కృష్ణ పక్షం.చంద్రుడు శివుని గూర్చి తపస్సు చేసి అనుగ్రహం పొంది ఆయన శిరస్సుపై చంద్రవంక గా వెలిశాడు.అలా సోమనాథుడు జ్యోతి ర్లింగం తొలి శివలింగం వెల్సిన పుణ్య భూమిలో దీర్ఘ వ్యాధులు పోతాయి. శివుని గూర్చి పరమాచార్య ఇలా అన్నారు " ఈశ్వరా! నీతలపైగంగాజలంతో చల్లదనం.పైగా చంద్రుని చల్లదనంకితోడు ఒంటి నిండా పాములు చల్లగా పాకుతుంటాయి.పాదాలకి వాసుకి చుట్టుకుంది.నీభార్య హిమవంతుని కూతురు.భక్తులు చందనం నీటితో అభిషేకాలు చేస్తారు.ఇంత చలిని తట్టుకునే శక్తి ఉన్న నీవే మాకు దైవం.ఇక శ్రీశైలం లో హాటకేశ్వరంలో కుండపెంకులో బంగారు లింగం ఆవిర్భవించింది.పంచధారలు అంటే శివుని ఫాలంనుంచి లలాటం నుంచి వెలువడే బ్రహ్మ విష్ణు రుద్ర చంద్రదేవధారలునే పాలధారలు అని వాడుక లో వచ్చింది.
ఇక ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యం కోసం కూడా శివార్చన చేస్తాం.పూర్వం గర్భిణీకి ప్రసవ సమయంలో నెప్పులు వస్తుంటే శివాలయం కి పరుగెత్తి చరనంది ని తిప్పేవారు.నువ్వులువేసి ఆకదిలేనందిని తిప్పగానే ఆమె కి సుఖప్రసవం అయ్యేది.అలాగే శ్రీశైలం లో శిఖరేశ్వరం దగ్గర చరనందిని తిప్పితే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.శ్రీశైలంలో వృద్ధి మల్లికార్జున లింగం అంతా ముడతలు ముడతలు గా అవ్వతాతల చర్మం లాగా ఉండటం విశేషం అక్కడ ప్రవహించే కృష్ణా నదిని పాతాళ గంగ అనే పిలుస్తారు.అక్కడ ఉన్న సెనగలు బసవయ్య రంకె వేస్తే కలియుగ సమాప్తం అని పురాణాల్లో చెప్పబడింది.ఇలా ప్రకృతిని ఆధ్యాత్మిక చింతన ను దైవ భక్తి ని రంగరించిన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం మనం విని కొంత లో కొంతైనా ఆచరిస్తే మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది.అందుకే ఆదిశంకరాచార్యులు పరమాచార్యులు ఋషులు జీవితాలు తెలుసుకున్న నాడు మనలో చైతన్యం పరివర్తన రావడం ఖాయం.సైన్సు కూడా ఒప్పుకున్న పరమసత్యం.పెద్దలు ఇంట్లో పిల్లలకి దైవ భక్తి తోపాటు శుచి శుభ్రత ఆరోగ్య సూత్రాలు అలవాటు చేయాలి 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి