ప్రసిద్ధ సినీ గేయకవి, లలిత గీతాల రవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అకాలమరణం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. ఒకపక్క లలిత గేయాలు, మరోపక్క సినిమా పాటలతో పాటు అనేక నృత్య నాటకాలను రచించిన దిట్ట. నిత్యచైతన్యశీలి అయిన వడ్డేపల్లి కృష్ణ గారి మరణం అత్యంత విషాదకరం.ఆయనకు నివాళులు
లలితగీత రచయితగా లబ్ధ ప్రతిష్ఠుడైన వడ్డేపల్లి కృష్ణ ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలతో పాటు, ఆడియో ఆల్బమ్ ల రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా, విభిన్న పార్శ్వాల్లో తన రచనా నైపుణ్యాన్ని ప్రజలకు అందించారు
గోభాగ్యం అనే లఘు చిత్రానికి అంతర్జాతీయంగా పలు పురస్కారాలు లభించాయి. బతుకమ్మ, రామప్ప రామణీయం వంటి చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నారు. వడ్డేపల్లి కృష్ణ తెలంగాణలోని సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నాగోల్ లో స్థిరపడ్డారు. మొదట్లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసిన ఆయన ఆ తర్వాత సినీ రంగంవైపు అడుగులు వేశారు. పిల్ల జమీందార్ చిత్రంలో నీ చూపులోనా విరజాజి వాన పాట రాశారు. అలాగే జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించారు.
సమైక్య సాహితి అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్ కె ఎస్ అనంత ఆచార్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి