శ్లో!- దృతి స్తంభాధారం దృఢగుణ నిబధ్ధాం సగమనాం
- విచిత్రాం పద్మాధ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితామ్
- స్మరా రే మచ్చేతః స్పుటపట కుటీం ప్రాప్యవిశదాం
- జయస్వామిన్ శక్త్యా సహా శివ గణై స్సేవిత విభో !!
- భావం: కామ జయము కలిగి సర్వ స్వతంత్రుడవును , పరమానంద స్వరూపుడ వగు ఓ పార్వతీ వల్లభా ! నా చిత్తమిపుడొక గుడారముగ నున్నది. నా మనః కుటీరము విషయ
- నిత్యత్వావధారణ మనెడు నిట్రాటి పైని నిలిచి యున్నది. గుడారము త్రాళ్ళతో కట్టబడి నిలుపుబడు నట్లు చిత్తము త్రిగుణాల వలన జనియించిన దేహాదులతో నిలుపబడి యున్నది.గుడారమెక్కడికీ కావాల్సిన అచ్చటకు గొనిపో బడునట్లు,ఈ చిత్తమచ్చటచ్చట
- కు, గొనిపోబడును. గుడారము పలురంగులతో, పద్మముల వంటి చిత్రములతో నుండునట్లుగ, నా చిత్తము బహువిధములగు చిత్రవిచిత్రములగు జన్మాంతర వాసనలతో కలసి సంపదను కోరుచున్నది. మరియు బ్రహ్మ విచారం నందు కూర్చబడి ఉన్నది. నా చిత్త కుటీరం నందు శక్తితో కూడి నివసించుము తండ్రీ !
- *****
🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి