ఎవ్వరూ
నాదగ్గరకురారు
సుద్దులు
వల్లెవేస్తానని
ఎవ్వరూ
నాజోలికిరారు
కోతలు
కోస్తాననీ
ఎవ్వరూ
ననుపట్టించుకోరు
వెర్రివేషాలు
వేస్తానని
ఎవ్వరూ
ననుకలవరు
మాటలను
ఈటెల్లావిసురుతానని
ఎవ్వరూ
ననుపిలువరు
ప్రవచనాలు
చెబుతానని
ఎవరూ
ననుపలుకరించరు
దొరికితే
విడువనని
కానీ
కవితమ్మ
నిత్యమూ
వస్తుంది
కలలోకి
వస్తుంది
కవ్వించి
పోతుంది
వెన్నునూ
తడుతుంది
విషయాలనూ
ఇస్తుంది
కమ్మగా
రాయిస్తుంది
దన్నుగా
నిలుస్తుంది
కవితమ్మకు
ఆహ్వానం
కవితలకు
స్వాగతం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి