పూర్వం వ్యాకరణం శివాలయంలో నేర్పేవారు.. చంద్రశర్మ అనే యువకుడు రావి ఆకులపై 9 రాత్రులు 9పగళ్లు తన తొడని గీరి ఆరక్తంతో పతంజలి చెప్తుంటే రాశాడు మహాభాష్యంని.అలా అదిపూర్తి ఐనాక ఓబట్టలో మూటకట్టి నిద్రపోయాడు దాన్ని తలకింద పెట్టుకుని. మాంఛి గాఢనిద్ర లో ఉన్న అతని మూటలోని కొన్ని రావిఆకుల్ని ఓమేక తినేసింది.ఆహారం నిద్ర లేని అతనికి ఎప్పటికో మెలుకువ వచ్చింది. సన్యాసం స్వీకరించాలనే ధ్యాస లో ఉన్నాడు.నడిచి నడిచి ఓ ఇంటి బైట అరుగుపై పడుకున్నాడు.చాలా అందగాడైన అతన్ని ఆఇంటియజమాని ఓవైశ్యుని కూతురు చూసింది.ఆమె కు వైద్యం కరతలామలకం. అందుకే శరీరమంతా పెరుగన్నం తో మసాజ్ చేసింది. దానితో అతనికి అలసట నీరసంపోయాయి.ఆమె తండ్రి చంద్ర శర్మ తో" మా అమ్మాయి నీకు ఆరోగ్యం చేకూర్చి బ్రతికించింది.ఆమె ను పెళ్లి చేసికో" అని కోరతాడు. "నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను.వైరాగ్యంతో నిండిపోయింది నామనస్సు" అన్న అతన్ని రాజు దగ్గరకు తీసుకుని వెళ్లి "
నాకూతురిని పెళ్లాడటానికి నిరాకరించాడు ఇతను" అని ఆరోపణచేస్తాడు.అతని తెలివి అందంచూసిన రాజు తన కూతురు ని పెళ్లి చేసుకో అని అనడంతో ఖంగుతిన్నాడు శర్మ. అప్పుడు తెలివిగా మంత్రి " ఇతను బ్రాహ్మణుడు కాబట్టి ముందు నాకూతురునిచ్చి వివాహం చేస్తాను. ఆపై అతను వైశ్య క్షత్రియ కన్యల్ని పెళ్లి చేసుకోవచ్చు" అని సలహా ఇచ్చాడు. అలా చంద్ర శర్మ ముగ్గురు కన్యల్ని పెళ్లాడాడు.కానీ ఓషరతు పెట్టాడు "వారి కి ఓకొడుకు పుట్టినాక సన్యాసం తీసుకుంటాను." అలా సన్యాసి ఐనా క నర్మదాతీరంలో గోవిందపాదాచార్యులుగా ప్రసిద్ధికెక్కారు. ఆయనే ఆదిశంకరాచార్యులవారికి గురువు గా వినుతికెక్కారు. అలా శంకరాచార్యుల పరంపర ప్రారంభమైంది.
కొసమెరుపు
గుండుతో శివుడు ఉంటాడని రుద్రాధ్యాయం చెప్పింది.4 గురు శిష్యులమధ్య ఆదిశంకరాచార్యులవారు నెత్తిపై బట్టకప్పి ఉన్న శివుడే అని అంతా గుర్తించారు. వడుగు కాగానే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నేర్చుకోవచ్చు. కానీ అధర్వవేదం నేర్వాలంటే రెండోసారి ఉపనయనం చేసుకుని తీరాలి 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి