ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి ఏబదేండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయనగరం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో రాజాం నియోజకవర్గం టీమ్ విజేతగా నిలిచింది. యుటిఎఫ్ స్వర్ణోత్సవాల రాష్ట్ర కమిటీ నిర్దేశాల మేరకు, విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ వాలీబాల్ పోటీల్లో పది నియోజకవర్గాల టీమ్ లు పాల్గొనగా, రాజాం నియోజకవర్గ టీమ్ ప్రథమ స్థానం కైవశం చేసుకుంది. రాజాం నియోజకవర్గం తరఫున వాలీబాల్ టీమ్ సభ్యులైన ఉపాధ్యాయులు సిరిపురం రాంబాబు, పెంకి గౌరీశంకరరావు, కడగల రామచంద్రుడు, పి.వెంకటనాయుడు, కె.హరి, తవిటినాయుడు, షాబ్జాన్,
పి.నరేష్ లు మిక్కిలి ప్రతిభావంతంగా శ్రమించి ఆటను ప్రథమ స్థానంలో నిలబెట్టారు. ఈ విజయం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, జిల్లా కార్యదర్శులు పి.వాసు, బి.రామినాయుడు, డివిజన్ అధ్యక్షులు గిరడ చంద్రశేఖర నాయుడు, కార్యదర్శి జి.రమేష్, రాజాం మండల శాఖ అధ్యక్షులు మువ్వల రమేష్, ప్రధాన కార్యదర్శి బలివాడ నాగేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి