ఒకరోజు నా కొడుకు చదువుతున్న స్కూల్ ఆవరణలో వాడితోపాటు నడుస్తూంటే ఓ చోట ఎరుపు రంగులో పెయింట్ చేసిన ఓ బల్ల కనిపించింది.
అప్పుడు నేను నా కొడుకుతో "కాస్సేపు ఇక్కడ కూర్చుందామా?" అని అడిగాను.
అప్పుడు వాడు ఇలా చెప్పాడు, "అమ్మా అక్కడ అందరూ కూర్చోవడానికి వీల్లేదమ్మా. దాన్ని బడ్డీ బెంచ్ అంటారు. ఎవరైనా ఒంటరిగా అనిపించినప్పుడు లేదా వారితో ఆడటానికి ఎవరూ లేరని అనుకున్న వారు మాత్రమే ఆ ఎర్రబల్లమీద కూర్చుంటారు. ఆప్పుడు పిల్లలు వారిని తమతో ఆడుకోమని అడుగుతారు." అని.
ఆ మాట విన్న నేను వెంటనే
"వావ్... ఈ ఏర్పాటు అద్భుతంరా. ఈ ఆలోచన ఎవరిదో కానీ అమోఘం. ఎప్పుడైనా ఎవరైనా ఇది ఉపయోగించేరా" అని అడిగాను.
అప్పుడు వాడు "అవునమ్మా... ఎవరో ఎందుకు... నేను ఈ స్కూల్లో చేరిన కొత్తలో ఒంటరిగా అన్పించేది. దాంతో నేనీ బల్ల మీద కూర్చునే వాడిని. అప్పుడు నా దగ్గరకు కొందరు పిల్లలు వచ్చి మనమందరం ఒక్కటే అంటూ నన్ను తమతో ఆడుకోవడానికి తీసుకువెళ్ళి ఒంటరిననే భావాన్ని లేకుండా చేసేవారు. ఈ విధంగా ఈ బల్ల కొన్నిసార్లు నాకు సంతోషాన్నిచ్చిందమ్మా" అని చెప్పాడు.
వాడి మాటలు వింటుంటే ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టిన వ్యక్తికి మనసులో ధన్యవాదాలు చెప్పాను.
- ఇంగ్లీషులో చదివిన దానినే అనుసృజించాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి