భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి తీసుకెళ్ళగల భాష హిందీయేనని పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ అన్నారు.
సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో
పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న యిసై సౌజన్యవతిని ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువా, పూలమాల, నుదుట తిలకం, పుష్పగుచ్చం, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు హిందీ అంశాలతో కూడిన క్విజ్ పోటీలను నిర్వహించగా, గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసారు. అలాగే తరగతి గదుల్లో హిందీ పాఠ్యాంశాల చార్టుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆ ప్రదర్శనలలో మిక్కిలి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, యిసై సౌజన్యవతి, కుదమ తిరుమలరావులు పాల్గొని
హిందీ భాష అలవడితే దేశంలోను, విదేశాల్లోను మనుగడ సాధించవచ్చని, భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే భాష హిందీయేనని ప్రసంగించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి