🪷శివానందలహరి🪷;- కొప్పరపు తాయారు

శ్లో:
జ్వాలోగ్రస్సకలామరాతిభయధః క్ష్వేళః  కథం వా త్వయా
దృష్టః కించ కరే దృతః కరతలే కిం పక్వ  జంభూపలమ్ 
జిహ్వాయాం నిహితశ్చ సిధ్ధ గుటికా వా కంఠదేశే భృతః
కిం తే నీలమణీ  ర్విభూషణ మయం శంభో  మహాత్మన్.  వద    !!

భావం:
మహాత్మా!ఓ శివా! భయంకరమైన మంటలు కక్కుతున్న కాలకూటమును ఎలా చూడగలిగావు,చూసి చేతి తీసుకుని  అరచేతిలో వేసుకున్నావు,అది ఏమైనా నేరేడు
పండా ? అక్కడితో ఆగక దానిని నాలుకమీద వేసుకుని 
కంఠము నందు నిలుపు కొంటివి.ఇది
నీకు ఆభరణముగా ఉండే నీలమణియా ?చెప్పుము!
         ******

కామెంట్‌లు