న్యాయాలు -616
బిడాల విణ్మోచన న్యాయము
*****
బిడాలము అనగా పిల్లి ,కనుగ్రుడ్డు. విణ్మోచన అనగా విడిపించుట,విడుచుట, విసర్జన అనే అర్థాలు ఉన్నాయి.
పిల్లి మల విసర్జన చేయునప్పుడు గొయ్యిని తవ్వి అందులో మల విసర్జన చేసి మళ్ళీ ఆ గొయ్యిని పూడుస్తుంది అని అర్థము.
పిల్లి ఎందుకు అలా చేస్తుందో తెలుసుకుందాం.పిల్లి, కుక్క, కుందేలు లాంటి జంతువులన్నీ అడవి జంతువులే.మానవుడు ఎప్పుడైతే ఇల్లూ వాకిలి ఏర్పాటు చేసుకున్నాడో తన వివిధ రకాల అవసరాలకు వివిధ జంతువులను, పక్షులను మచ్చిక చేసుకొని ,తన పనులకు ఉపయోగించుకున్నాడు.
అలా పిల్లి కూడా మొదట్లో అడవి జంతువు కాబట్టి అడవి జంతువుల్లో ఉండే లక్షణం దానిలో అలాగే వుండి పోయింది. పిల్లులు తాము ఉండే లేదా తిరిగే సరిహద్దును గుర్తు పెట్టుకోవడం కోసం,తమ కంటే పెద్దవైన జంతువుల బారిన పడకుండా రక్షించుకోవడం కోసం ఒక్కో జంతువు ఒక్కో విధానాన్ని అనుసరిస్తాయి.అవి కేవలం జంతువులనే కాకుండా తమను పెంచుకునే మనుషులను , యజమానులను కూడా అంత త్వరగా నమ్మవు.తమను తాము రక్షించుకోవడానికి తగు జాగ్రత్తలో ఉంటాయి.
మరి మనం చెప్పుకుంటున్న పిల్లి గురించి బోలెడన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఏదైనా అనగానే ఎవరైతే భయపడి వణికినట్టు ఉంటే 'పాపం వాడుట్టి పిల్లకూన వాణ్ణి వదిలేయండి ' అంటుంటారు.
పిల్లి గురించి నవ్వొచ్చే కథ గూడా ఉంది.అది మన అవ్వలు,తాతలు చెప్పిన కథ.అదేంటో చూద్దామా....
పులికి పిల్లి మేనమామ అంటుంటారు కదా !అలా మేనమామైన పిల్లి పులికి అన్ని విద్యలు నేర్పిందట కానీ చెట్టెక్కడం నేర్పలేదట. అందుకే పులి పిల్లిని అడవంతా ఉరికిచ్చి భయపెడుతుంది. ఆ భయానికి పిల్లి మల విసర్జన చేస్తే దాన్ని వాసన చూసి కప్పెట్టమని గద్దిస్తుందట.అందుకే పులికి భయపడి పిల్లి అలా చేస్తుందని సరదాగా చెబుతుంటారు.
అసలు విషయానికి వద్దాం .పిల్లులు తమ శత్రువులు అంటే తమకంటే పెద్దవైన జంతువులు, తమ ఆనవాళ్ళు గుర్తించకుండా , తెలియకుండా వుండేందుకు మల విసర్జన తర్వాత మట్ఠి తవ్వి అది కనబడకుండా పూడ్చీ పెడుతాయి.అంటే తమ జాగ్రత్తలో తాము ఉంటాయన్న మాట.
పిల్లిని పులిజాతికి చెందిన జంతువు అంటుంటారు. పులికి పిల్లికి చాలా పోలికలు ఉంటాయి.వేగం, పరుగెత్తడం లాంటివి. పెంచుకునే పిల్లి తన యజమాని యొక్క భావోద్వేగాలు గమనించి మసలుకుంటుంది..
ఇదండీ "బిడాల విణ్మోచన న్యాయము" వెనుక ఉన్న కథా కమామీషు.
ఐతే మన పెద్దవాళ్ళు మనకు ఈ "బిడాల విణ్మోచన న్యాయము" చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే శత్రువులు మన చుట్టూనే కనబడి హాని చేసేవారు కొందరూ,మనకు కనబడకుండా హాని చేసేవారు ఉంటారు. మన రహస్యాలు,ఆనుపానులు వారికి తెలియకుండా తప్పించుకోవాలని అర్థము.
మరి మనం సరదా కదను ఆస్వాదిస్తూ, సాధ్యమైనంత వరకు శత్రువులకు మన గుట్టు మట్టులు తెలియకుండా జాగ్రత్త పడదాం. ఏమంటారు?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి