పోలాల అమావాస్య;-సి.హెచ్.ప్రతాప్

 ప్ర తీ ఏడాది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే జాతకదోషాలన్నీ తొలగిపోతాయని అని శాస్త్ర వచనం. పోలాల అమావాస్య ఎంతో శక్తిమంతమైనదని పండితుల ఉవాచ. ఈ రోజున గ్రామంలోని గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి పెరుగన్నం నైవేద్యంగా పెడితే కష్టాలన్నీ తీరిపోతాయని అసేష భక్త జనుల నమ్మకం. అలాగే గ్రామదేవతలకు నిమ్మకాయ దండలు వేసినా, నిమ్మకాయ దీపాలు వెలిగించినా, కుంకుమ సమర్పించినా ఇంట్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
శ్రావణ అమావాస్య రోజున ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనసులో కోరుకున్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. అలాగే జాతకంలో కుజ దోషాల వల్ల వివాహ, దాంపత్య సమస్యలు ఉన్నవారు పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం ముక్క లేదా బెల్లంతో తయారైన పదార్థాలు తినిపిస్తే దోషాలు తొలగిపోతాయి.ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ, వివాహిత మహిళలు తమ సంతానం కోసం, పిల్లల యోగ క్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 02వ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజున సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది.అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. ఇంటిని శుభ్రం చేసి.. పూజా గదిలో కందమొక్కను ఉంచాలి. ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని గానీ ఆవాహనం షోడపశోపచారాలతో పూజలు చేయాలి. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి.ఈ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. జీవితం సుఖసంతోషాలతో కొనసాగడానికి, పిల్లలు సౌఖ్యం కోసం మహిళలు పోలాల అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు. దుఃఖాల నుండి బయటపడటానికి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజున తులసి మొక్కను పూజించడం, ప్రదక్షిణ చేయడం ద్వారా మహిళలు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణం చేయడం వలన కష్టాలు, దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.పోలాల అమావాస్య రోజున ఉపవాసం చేసి తులసి ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అంతేకాదు మోక్షం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేసే సమయంలో మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయరాదు. తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.ప్రకృతిని పూజించడంతో పాటు వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించే ఎద్దులను అందంగా సింగారించి ఆరాధించే అరుదైన పండుగ ఇది. వ్యవసాయ పనులు పూర్తైన క్రమంలో వచ్చే తొలిపండుగ కావడంతో రైతులు, కొన్ని సామాజిక వర్గాల ప్రజలు పొలాల అమావాస్యను అత్యంత ఘనంగా జరుపుకోవడం అనవాయితీ. 
కామెంట్‌లు