పరిమళించు ప్రకృతిలో
పరవశించు మదిలోపల
ప్రకటమయే భావాలకు
పరిచయం అవసరంలేదు
అనుభవం చాలు!
వికసించు విరుల సొగసు
వినిపించు మోహన రాగపు
విన్నపాల వివరాలకు
వీనులవసరం లేదు
హృదయముంటే చాలు!
తడవకో రంగు మారుతూ
తెరలు తీసే తూరుపు వేదికపై
తెల్లవారి వెలుగుల సందడి
తిలకించడానికి ఊహలవసరం లేదు
ఆకాంక్ష చాలు
నీటిమీద సువర్ణ కాంతులతో
నీరెండ రాసే ప్రేమలేఖలు
నిలిచి చదవాలంటే సమయం కాదు
మనసుంటే చాలు
దివిలోని అందాల తీరేమో కానీ
రవికిరణాలు ఉషోదయాన చిత్రించు
భువిలోని కమనీయ సోయగాలు
చవిచూప కవి అవసరంలేదు
కనులున్న చాలు!
అపురూపమైన అవనీతలము
అరుణోదయాన ఆవిష్కరించు
అగణిత అందాల వన్నెలెన్నో
అనుభవింపచేసే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి