తెలంగాణ సారస్వత పరిషత్తు త్వరలో హైదరాబాదులో బాలల సాంస్కృతికోత్సవం నిర్వహిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. వివిధ అంశాల్లో పోటీలు,సృజనాత్మక రచన అధ్యయన శిబిరాలు జరుగుతాయి.వివిధ రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న బాల మేధావులు తమ అనుభవాలు పంచుకుని తోటి విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తారు.
పోటీలు రెండు రకాలుగా జరుగుతాయి.
ఒకటి:విద్యార్థులు తమ గ్రామాల నుంచే రాసి పోటికి పంపవచ్చు.రెండు పేజీలకు మించకుండా కథ, 20 పంక్తులకు మించకుండా ఏదేని అంశంపై వచన కవిత, ఐదు పద్యాలకు మించకుండా పద్య కవితా పోటీకి రాసి పంపవచ్చు. చిత్రలేఖనం గీసి పంపవచ్చు.చిరునామా: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్డు, ఆబిడ్స్, హైదరాబాద్.1
రెండు: ఉత్సవం రోజున కూడా అప్పటికప్పుడు పోటీలుంటాయి.ముఖ్యంగా మేకప్ లేకుండా ఏకపాత్రాభినయ పోటీ, దేశభక్తి, లలిత గీతాలాపన పోటీ,వ్యాసరచన, వక్తృత్వం, పుస్తక సమీక్ష పోటీ లు ఉంటాయి.
విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు.
ఆరు నుంచి పదవ తరగతి లోపు చదువుతున్న బాల బాలికలు 9 6 0 3 7 2 7 2 3 4 వాట్సాప్ నెంబర్ కు తమ పేరు,తరగతి,పాఠశాల, ఊరి పేరు ఇతర వివరాలను పంపాలి. ప్రతినిధులుగా పాల్గొనేవారు, పోటీల్లో పాల్గొనేవారు అక్టోబర్ 10వ తేదీలోగా వేరువేరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య ఒక ప్రకటనలో కోరారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి