జన్మమెత్తినది...సంపూర్ణముగా జీవించటానికే...!
అర్ధాంతరంగా తనువు చా లించటానికా...!?
అనుకున్నది సాధించలేక పోయామనో...
పరరాజయం పాలయ్యా మనో...
ఆత్మ హత్యకు పాల్పడి...
చరిత్ర హీనులైతే ఎలా...!
చాతగాక చచ్చారని పించు కుంటాం...!!
బ్రతకాలి ..., చావు దానికదిగా వచ్చే వరకూ ఎన్ని సమస్యలెదురైనా...
పోరాడు తూనే బ్రతకాలి !
ఎన్ని ఓటమిలు చవి చూస్తున్నా...
చివరి వరకూ పొరాడుతూనే బ్రతకాలి ...
జీవితంలో వీరే నిజమైన విజేతలు...!
జీవితంలో అనేక విజయాలు సాధించేవాడికన్నా....
ఎన్ని ఓటమిలను చవి చూస్తున్నా...
చివరి వారకూ నవ్వుతూ జీవించ గలిగిన వాడే....
నిజమైన విజేత....!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి