ఓ అల్చిప్ప మరొక అల్చిప్పతో చెప్పింది...అయ్యో, నేను నొప్పి భరించలేకపోతున్నాను అని.నాలో దో ఓ బరువైన గుండ్రటి ఆకారంలో దొర్లుతున్నట్టు ఉంది. నొప్పి భరించలేకపోతున్నాను.అది విన్న మరొక అల్చిప్పకు బలే సంతోషమేసింది.గొప్పగా తలెత్తుకు చూసింది.అహా, దేవుడికి కృతజ్ఞతలు. నాకలాటి నొప్పులేవీ ఇవ్వలేదు దేవుడు అంది ఉత్సాహంగా.నేను ఏ బాధా లేకుండా క్షేమంగా ఉన్నానంది ఆ అల్చిప్ప.ఇద్దరి మాటలు విన్న ఓ ఎండ్రకాయ రెండవ అల్చిప్పతో చెప్పింది...నీకు ఏ నొప్పీ లేదు అనేది నిజమే కావచ్చు. నొప్పిని భరించడానికి ఇష్టపడని నువ్వు ఎప్పటికీ ఇలా ఏమీ లేకుండానే ఉండాల్సిందే. కానీ ఇప్పుడు నీ మిత్రుడిని ఇబ్బంది పెట్టే ఆ నొప్పి ఇంకొన్ని రోజుల్లో ఓ అందమైన ముత్యమై రూపొందుతుంది. అప్పుడా అల్చిప్పకు పేరుప్రఖ్యాతులన్నీ వెతుక్కుంటూ వస్తాయి అంది.
ముత్యం;-;-మూలం - ఖలీల్ జిబ్రాన్ ;-అనుసృజన - యామిజాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి