సంతోషకరమైన విషయమేంటంటే, మనందరం మంచితనాన్ని పెంపొందించుకోవచ్చు! అది దేవుని పవిత్రశక్తి పుట్టించే లక్షణం. మన చుట్టూ ఉన్న లోకం అలాగే ప్రజలు మనపై చూపించే చెడు ప్రభావాల కన్నా, మన సొంత అపరిపూర్ణతల కన్నా పవిత్రశక్తి ఎంతో శక్తివంతమైనది. మంచితనం అంటే చెడు లేదా కుళ్లు లేకపోవడం. ఒక మంచివ్యక్తి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు పాటిస్తాడు, ఎప్పుడూ సరైనదే చేస్తాడు. మంచివ్యక్తి ఇతరులకు సహాయం చేసే అవకాశాల కోసం ఎల్లప్పుడూ చూస్తాడు, వాళ్లకు మంచి చేస్తాడు.తమకు నచ్చిన వాళ్లతో కలుపుగోలుగా వుంటూ పరస్పరం సహకరించుకుంటూ నలుగురిలో మంచివాళ్లనే పేరు తెచ్చు కుంటూ ఆ మంచితనం తమలో ఉందని భావించేవాళ్లు చాలా ఉంటారు. నిజానికి కొందరితో కాక అందరితో ఏ భేదభావాలను లెక్కించక కలిసి ఉండడమే మంచితనానికి నిదర్శనం. పూవు పరిమళం గాలి వాటంగా వీస్తుంది. మంచితనం మాత్రం అన్ని దిశలా సమానంగా విస్తరిస్తుంది అంటాడు చాణక్యుడు.నిజమైన మంచితనం రూపురేఖలే వేరు. దానికి ఎల్లలు లేవు. అది దిక్కులేని శవాన్ని మోసే భుజంలో ఉండవచ్చు. గర్భిణి, వయో వృద్ధులను ఉచితంగా తీసికెళ్లే రిక్షాలో ఉండ వచ్చు. రోజో పదిరొట్టెలు పంచిపెట్టే సామాన్యుడి చేతుల్లో ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురుగా కదిలే కాళ్లల్లో ఉండవచ్చు.దయ, సానుభూతి లక్షణాలు కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. ఇది మీ ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది. కానీ.. ఈ మంచి హద్దులు దాటితే మాత్రం పరిస్థితులు మారిపోతాయి. ఈ ప్రపంచం మీతో ఆడుకుంటుంది! మిమ్మల్ని మీరే ఒత్తిడిలోకి నెట్టేసుకుంటారు! మానసిక ఆందోళనలు చుట్టు ముడతాయి! చివరకు జీవితంలో ప్రశాంతత కరవైపోతుంది.అతి మంచితనం లక్షణంతో బయటి వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ.. సొంత వారికి ప్రయారిటీ తగ్గిస్తారు. ఇది ఒకటీ రెండు సార్లు కాదు.. ఇదొక అలవాటుగా మారిపోతుంది. ఆ విధంగా ఇంట్లో వాళ్ల ప్రయారిటీ ఎప్పుడూ సెకండ్ ప్లేస్ కే పరిమితమవుతుంది. దీంతో.. వారిలో ఒక అసహనం మొదలవుతుంది. ఈ పరిస్థితి ముదిరితే కుటుంబ సంబంధాలు సైతం దెబ్బతినే అవకాశం ఉంది.
మంచితనం;-సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి