కేవలం మానవ ప్రయత్నంతోనే అన్ని పనులూ నెరవేరవన్నది మన జీవితానుభవం. మనిషి ప్రయత్నానికి దైవబలం ఆసరాకాకుండాను, తోడు లేకుండాను కోరుకున్న విధంగా ఫలితం సాధిస్తామని సందేహం లేకుండా చెప్పలేం.ఆపకుండా అవిశ్రాంతం మానవ ప్రయత్నం అన్నది కొనసాగిస్తూ వుంటే, ఆ ప్రయత్నానికి దైవం అందించే సహకారం తోడవుతుంది ప్రత్యక్షంగా కనిపించకపోవ చ్చును గాని దీక్షతో చేసే సత్కార్యానికి ఎల్లప్పుడూ దైవబలం తోడుగా ఉండడం జరుగు తుందిమానవ మాత్రులమైన మనం జీవన సమరంలో ఎన్నో ఆటుపోట్లకు గురవుతుంటాం. ఎన్ని కష్టనష్టాలొచ్చినా ఆ దేవుడు మనల్ని కాపాడుతాడని నమ్మితే మనం ముందుకు పోగలం. సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. లేకుంటే సమస్యల దగ్గరే ఆగిపోతాం.దేవుడు ఉన్నాడన్న నమ్మకం మనకు బలాన్ని, సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అన్నది నిర్వివాదాంశం. మానవ ప్రయత్నమే మొదటిది. దైవం బలం ఆ ప్రయత్నాన్ని సరైన దారిన నడిపించి సఫలత దశకు చేర్చే ఉత్తమమైన తోడువంటిది అంతారు మన పెద్దలు, కనుక పురుష ప్రయత్నంతో పాటు దైవబలం కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం ఎంతో అవసరం. దైవబలం ఉంటే ఎంతటి భారమైనా మోయవచ్చు. ఎంత బలమున్నా దైవబలం లేకపోతే వ్యర్థమని ఎన్నో అసుర వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి.
ఇటీవల అంతర్జాలంలో ఒక వెబ్ సైట్ లో వెలువడిన కధనం యధాతధంగా ఇక్కడ ఉటంకించబడుతొంది:
డిశాకు చెందిన ఎస్ కే ఆసిఫ్ అలీ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని దారుణంగా చంపేశాడు. ఆసిఫ్ అలీని పోలీసులు అరెస్టు చేసి జగత్ సింగ్ పూర్ లోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన పోక్సో కోర్టు.. దీనిని అత్యంత అమానుషమైన నేరంగా పరిగణిస్తూ ఆసిఫ్ అలీకి మరణ శిక్ష విధించింది.
దీనిపై నిందితుడు ఒరిస్సా హైకోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ జైలులో రోజూ దైవ ప్రార్థన చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దేవుడి ముందు అలీ లొంగిపోయాడని వ్యాఖ్యానించింది. తాను చేసిన నేరాన్ని దేవుడి ముందు అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది. దీంతో ఆసిఫ్ అలీకి విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదుగా మారుస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి