అలసిపోయి ఆదమరచి
నిదురపోయి మేలుకున్న
ఉత్సాహపు ఉత్తేజం నిండిన
మనసులాంటి వెలుగులు...
మనసు నిండ పెంచుకున్న
మమత పండిన సంబరంలో
హృది నిండుగ పరచుకునే
తృప్తిలాంటి వెలుగులు
మరపురాని మధురమైన
మనసైన తలపులతో
మైమరచి పరవశం నిండిన
మదిలాటి వెలుగులు
దారి వెంబడి చూపు పరచి
చిన్న సవ్వడైనా అదిరిపడి
ఎదురుచూచు ఆత్రమంటి
అందమైన వెలుగులు
పాపాయి నిదురలేచి
అమ్మను కనుగొని
హాయిగా నవ్వుతూ అల్లుకునే
నిశ్చింతలాంటి వెలుగులు
తీరదనుకున్న కోరికేదో
తలవని తలంపుగా తలుపు
తట్టి పిలిస్తే కన్నుల వెలిగే
మెరుపులాంటి వెలుగులు
కమ్ముకున్న చీకటినంతా
కనిపించక తరిమేస్తూ
బంగరువెలుగులు నింపే
కొంగొత్త వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి