కనులకు కమనీయం
మనసుకు రమణీయం
బ్రతుకు దారి మోహనం
దృశ్యం మనోహరం
అంతులేని ఉత్సాహంతో
అడుగులేసే ఉత్తేజం
అవధిలేక అలముకుంది
అవనిపైన పచ్చదనం
మలుపులెన్నో దొరికినా
మజిలీలెన్నో చేసినా
మరపురాని పయనమౌను
మనసుతీర జీవనం
పచ్చని కోక కట్టిన
పల్లెపడుచు స్వేఛ్ఛగా
పంట పొలాల గట్లపైన పెట్టే
పరుగులంత అందంగా..
పుడమి కాగితాన
పచ్చని రంగు పులిమి
కుంచెతో శ్రధ్ధగా ఎవరో
చిత్రించిన చక్కని చిత్రంలా
మనసు నడిపే దారిని
మనిషి నడక తీరును
వరుసగా వేల్పులు కూచుని
వృక్షాల రూపాన చూస్తున్నట్టున్న
అపురూపమైన అవనిని
అలవికాని తీరున క్షోభపెడితే
అన్నీలెక్కపెట్టి ఉగ్రరూపంతో
ఆగ్రహిస్తే భరించ తరమా??
ముప్పుతో తప్పు చెప్పి
ఒప్పుగ నడచుకోమని
విప్పలేని ముడివేయవద్దని
చెప్పకనే చెప్పిన ప్రకృతికి
క్షమించమని కోరుతూ
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి