అక్షరాలు చెప్పలేని
అందాలు దాచుకున్న
అవనీతలపు సౌందర్యం
అనిర్వచనీయం ...
పచ్చగ మెరిసే లోయలన్నీ
పట్టుపుట్టము కట్టిన
పుత్తడిబొమ్మలా తోచు ఊహ
అపురూపం
చిరునవ్వు చిందిస్తూ
చిత్తమున ప్రేమ నింపుకుని
చిరకాలమూ రక్షించు తల్లియను భావన
అనుపమానం
అశేష జనానికి
ఆకలి తీర్చు ఆధారం
సుజలాలతో సుఫలాలతో
సస్యశ్యామలమైన ధాత్రి
కడు రమణీయం
ఇవ్వడమే తప్ప
అడగడం తెలియక
జనులు చేసే ఆగడాలన్నీ
భరించి క్షమించే గుణం
సదా స్మరణీయం
స్వార్థం మితిమీరి నష్టపరిస్తే
కష్టం దుఃఖం కలిగించి మరీ
పాఠం చెప్పి సరిదిద్దే తీరు
సమర్థనీయం
అనిర్వచనీయమైన
అపురూపమైన ధరణిని
అనుపమాన అభిమానంచూపి
ఆగ్రహపడకుండా చూసుకోవడం
అత్యవసర కర్తవ్యం.
అవనికి ఆత్మబంధువైన
ఆదిత్యుని ఆగమిస్తూ
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి