కీ.శే. గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా 01-9-2024 న సాలూరు ఆర్యవైశ్య కళ్యాణమండపంలో సాలూరు సాహితీ మిత్రబృందం సభ్యులు 89వ సాహితీ సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బాల సాహిత్యం లో విశేష కృషి చేస్తున్న శృంగవరపుకోటకు చెందిన ప్రముఖ బాలసాహితీ వేత్త శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాధంను, పద్యరచనలో విశేష ప్రతిభ కనపర్చుతున్న ప్రముఖ పద్య కవయిత్రి, రచయిత్రి గుమ్మా నాగమంజరిని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి. భంజ్ దేవ్ గారు ఘనంగా సత్కరించి యిండుపూరి రామనారాయణ, మురళీకృష్ణ స్మారక “వేగావతీ భారతీ” సాహితీ పురస్కారాన్ని కాశీ విశ్వనాథం నాగ మంజరి దంపతులకు అందచేశారు.
ఈ కార్యక్రమం లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నారంశెట్టి ఉమా మహేశ్వరరావు, ధర్మశాస్త్రం సంపాదకులు శ్రీ ఎస్. పి. రాజు, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు,
సాహితీ మిత్రబృందం వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. తిరుమలాచార్యులు, అధ్యక్షులు శేషాద్రి సోమయాజులు (శేషు మాష్టారు), కార్యదర్శి ఆకుల గణపతి, సాహుకారి చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి