...పుడుతూనే... ఏడుస్తాం ....; -. కోరాడ నరసింహా రావు !

 పుడుతూనే... ఏడుస్తాం ....
  ఊహ తెలుస్తున్న కొలది... 
   నిరంతరం ఏదో ఒక ఏడుపు...! 
   మనకు లేదనో... 
        ఎదుటి వానికి ఉందనో
    ఉన్నది చాలదనో.... 
      అన్యాయార్జనంతా.... 
            దొరికి పోయిందనో... 
   కావాలనుకున్నవన్నీ పొంద లేదనో..! 
     పొందినా  అనుభవించలేక పోతున్నాననో...!! 
 ఏడుపు... ఏడుపు... ఏడుపు
  జన్మమెత్తినది... ఏడవటా నికి కాదోయ్..., ఆనందముగా నవ్వుతూ , నవ్విస్తూ... బ్రతక టానికి...! 
  ఎప్పుడూ... ఎడుస్తు.. ఏడిపిస్తూ...
   బ్రతికె బ్రతుకు,ఒక బ్రతుకేనా
    అందుకే... ఒక సినీ గేయ రచయిత , "నవ్వుతూ బ్రతకా లిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా... అంటూ చచ్చినాక నవ్వ లేవురా... 
 ఎంత ఏడ్చినా తిరిగి రావురా
 బ్రతికి రావురా...! " అంటూ ఎంత గొప్ప సత్యాన్ని వెల్లడిం చాడు...! 
    కాబట్టి నవ్వండి ... నవ్విం చండి...,నవ్వుతూనేబ్రతకడి
   ఉత్తమ మైన మరో జన్మకు పోతున్నా మన్న ఆనందము లో నవ్వుతూనే చావండి...!! 
       ******
.
కామెంట్‌లు