కనులకు దూరంగా
కలల తీరం మధురంగా
కడలి తీరాన గమనంలో
కదిలే ఊహల ఊయల
కోటి భావల వీచికలే
మీటి పోగా మదిని
తేటి రాగాల తీరున
పాట పాడే మానసం
తూలుతూ తాకిన
తూరుపు గాలికి
కోరికలన్నీ పురులు విప్పి
నర్తించదా మాయూరమై!
కన్నులు కాయలు కాచేలా
కలవరంగా ఎదురు చూసిన
కమ్మని కబురేదో తేదా
కాలికి కట్టుకుని కపోతమై!
మేఘాల పల్లకి పై ఎక్కి
చుక్కలు తాకే వేడుకలా
హృదయం విహంగమై ఎగిసి
ఉదయరాగమాలపించగా..
వేచిన వేకువ కోసం
కాచిన మదిలో అలజడి
దాచిన దాగదు సంబరం
అందెనేమో అంబరం!
లంగరు వేసిన నావల్లే
ఒడ్డున నిలిచిన పడవల్లే
తీరం దాటిన వరదల్లే
భారం దిగిన భావమయేలా
అరుదెంచిన ఆదిత్యుని
అనుగ్రహముగ దొరికిన
అపూర్వమైన కానుకలా
అనిపించే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి