డయాబెటిస్ వచ్చిందంటే చాలు చాలా మంది ఏ ఆహారం తీసుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఏది తింటే షుగర్ పెరుగుతుందోనని ఆందోళన చెందుతుంటారు. ఇక పండ్ల విషయానికి వస్తే డయాబెటిస్ ఉన్న చాలా మంది పండ్లు ఎలాగూ తియ్యగానే ఉంటాయి కనుక వాటిని తినడం మానేస్తారు. కానీ నిజానికి అన్ని పండ్లను దూరం పెట్టడం మంచిది కాదు. ఎంత డయాబెటిస్ ఉన్నా సరే కొన్ని పండ్లను మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. అవేమిటో తెలుసుకుందాం... డయాబెటిస్ ఉన్నవారు యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, జామ పండ్లు, నారింజ, నేరేడు పండ్లు, అంజీర్, పైనాపిల్ పండ్లను నిర్భయంగా తినవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంతగా పెరగవు. ఇక మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు కూడా మిగిలిన పండ్లను కూడా తినవచ్చు. కాకపోతే చాలా తక్కు మోతాదులో తీసుకోవడం మంచిది. అది కూడా డాక్టర్ సలహా మేరకు ఆ పండ్లను తినడం మంచిది.
డయాబెటిస్ - ఆహారం - యామిజాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి