మానాయన;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
మానాయన
24/7మాఇంటికి
వెలుగు నిచ్చే సూర్య భగవానుడు

ఆసూర్యుడు అస్తమిస్తాడు కానీ మానాయన మాకుటుంబంకోసంతాను విరామమెరుగక  నిత్యం పరిశ్రమించే 
కృషీవలుడు
మా నాయనరెక్కలకష్టమే 
నేడు మేము అనుభవించే  ఈభోగభాగ్యాలు

తాను తన నెత్తురును నీరు గా మార్చి మాలో జవసత్తువ పెంచినాడు

మానాయన కష్టనష్టాలెన్నోచుట్టుముట్టిన గుండెనిబ్భరం కోల్పోనివాడు

మా నాయనా మామధ్య నున్నప్పుడు ఎంత ఘటికుడో
తానొంటరిగా ఉన్నప్పుడు గుండె చెరువయ్యేలా ఏడ్చేఅతిసున్నితమనస్కుడు

రేపు మానాయనను
అవసాన దశలో మేముమాకన్నపిల్లలోలే
చూస్తామోలేదో?

మానాయన మాకు జన్మజన్మలకు సరిపడధైర్యాన్నిచ్చాడు

అందరూ అంటారు అమ్మ భూమాతని నిజమే
కానీ అమ్మలేనిమాకు
మానాయనా మా పొడిచే ప్రొద్దు పొడుపు 

నిత్యం మాబ్రతుకులను వెలిగించడానికి
 తనరెక్కలుముక్కలు చేసుకొని
మాకే లోటురాకుండాచూసాడు

 మాచుట్టేపరిభ్రమించే భూమాతే మానాయన
మా నాయనే ప్రత్యక్ష దైవం 

కామెంట్‌లు