నవ్వుతూ బ్రతకాలిరా - 3:- సి.హెచ్.ప్రతాప్
 (1) ‘ఇంత చక్కగా , అందంగా ఆకర్షణీయంగా వుంటావ్ కదా మరి పెళ్లెందుకు చేసుకోవు’’ అడిగాడు భార్గవ్ ని సాయి. ‘‘భలేవాడివే! అమ్మాయిలతో డేటింగ్ చేసే సరదా ఎల్లప్పుడూ తీర్చుకునే అవకాశాన్ని వదులుకోమంటావా ఏమిటి?’’అని థక్కున సమాధానం ఇచ్చాడు భార్గవ్.
(2) ఇంగ్లీషులో పొడుగాటి పదం ఏమిటి’’ అడిగింది టీచర్. ‘‘స్మైల్స్ " అని జవాబిచ్చింది మానస్వి.
‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగింది టీచర్.
‘‘మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్య ఒక మైలు వుంది కదా!’’థక్కున చెప్పించి మానస్వి
(3) "ఏమండి.. పక్కింటి ఆయన వాళ్ల ఆవిడకు 15వేల చీర కొన్నాడట.. మీరు అంత ధరతో అంత మంచి చీర ఒక్కటైనా మన పెళ్ళయిన పదిహేనేళ్ళలో చీరైనా కొనిపెట్టారా?" అడిగింది మూతి విరుస్తూ లక్ష్మి
 
 
"ఎవరికి.. పక్కింటి ఆవిడకా.., ఆవిడకు కిందటి నెలలోనే కొన్నానే ?"  టక్కున సమాధానం చెప్పి నాలిక కరుచుకున్నాడు రవి.
(4) ."పూల కొట్లో పనిచేసేవాడిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే " ఏడుస్తూ చెప్పింది లలిత.
"ఏం చేస్తున్నారు మీ ఆయన" లక్ష్మి.
"తల్లో ఫూలు పెట్టుకున్నప్పుడల్లా పదేసి నిమిషాలకొకసారి వాటిపై నీళ్ళు జల్లుతున్నాడు. రొంప, దగ్గు ,జ్వరం ఇత్యాది రొగాలతో చస్తున్నాను" ముక్కు చీదుకుంటూ చెప్పింది లైత.  

కామెంట్‌లు