ఆశారాణిసుమన్ రాజస్థాన్ లో దివ్యాంగులకై ముఖ్యంగా ఆడపిల్లలకోసం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు నడుపుతూ 30వేలమందికి శిక్షణ ఇచ్చారు. కరాటేతో పాటు గుడ్ బ్యాడ్ టచ్ గూర్చి వివరిస్తోంది ఆమె.
ఒడిషాకి చెందిన చింతామణి రౌత్ అనే రిటైర్ఐన మాష్టారు తనపొలంలో పండే కూరలు పళ్ళు బడిపిల్లలకి ఉచితంగా పంపిణీ చేస్తూ ఫ్రీగా చదువు చెప్పే ఆయన వయసు 80 అంటే నమ్ముతారా?
గిన్నిస్ బుక్ లో ఎక్కిన ముంబైప్రొఫెసర్ చైతన్య సింగ్ ఎనర్జీ స్వరాజ్ యాత్ర పేరు తో మహారాష్ట్ర లో గ్రామానికి సౌరవిద్యుత్ తో వెలుగు నింపాడు.పళనికుమార్ అనే ఫోటో గ్రాఫర్ జాలరి పిల్లలు స్త్రీల కు ఫోటో గ్రఫీ నేర్పుతూ వారు తీసిన ఫోటోలతో ఎగ్జిబిషన్ పెట్టి నిధుల సేకరించి పిల్లల బడిఫీజులు కట్టడం ఓఅద్భుతం! మధ్యప్రదేశ్ లో బీహార్ పుర్ అనేగిరిజనపల్లెకు పేరు తెచ్చిన ఘనత పి.ఇ.టి.మాష్టారు రాయిస్ అహ్మద్ ది.సారామత్తులో మునిగే బాలలు యువతలో ఫుట్బాల్ ఆటతో గొప్ప చైతన్యం తెచ్చాడు.బిచార్పుర్ లో ఛాంపియన్లు తోపాటు వెయ్యి గిరిజన గ్రామాల్లో ఫుట్బాల్ క్రాంతి కి మూలపురుషుడని అంతా కొనియాడారు. సాకర్ బాటలో మద్యం మానేసి పిల్లాపెద్ద ఖుషీ గా ఉన్నారు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి