మనిషికి మనిషి చేతనైనంత సాయంజేయాలి కానీ తన్నుమాలిన ధర్మం మొదలుచెడ్డబేరం. జంతువులు పక్షులకు ఆసుపత్రులున్నాయి. వాటిని పెంచేవారు శ్రద్ధతీసుకుంటారు.కానీ పంజాబ్ కి చెందిన రోహిత్ మెహ్రా చెట్లకోసం హాస్పిటల్ నడుపుతున్నాడంటే వింతగా ఉందా?ట్రీ యాంబ్లెన్స్ ఏర్పాటుచేసి రోగాలరాగాలచెట్లకు చికిత్స చేస్తాడు.75పైగా చిట్టడవులను సృజించాడు. గ్రీన్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచాడు.
పంజాబ్ కి చెందిన రాజేందర్ సింగ్ ఖోటే జబ్బు తో తండ్రి భార్య చనిపోతే ఆసుపత్రుల్లోని రోగులకు దాదాపు వెయ్యిమందికి మందులు ఆహారం అందజేస్తు మెడిసిన్ మాన్ గా పిలవబడుతున్నాడు. దాదాపు 15 ఏళ్లుగా సేవచేస్తున్న ఇతను కంప్యూటర్ టైప్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు.
ఇక మానవసేవయే మాధవసేవ అని నమ్మిన వాడు ఓన్లీ ఇండియన్ గా పేరుగాంచిన వాడు ఆపేరుతోటే స్వచ్ఛంద సంస్థ ను స్థాపించారు.గుడిలో దేవతావిగ్రహాలకు పాలాభిషేకాలు చేసే జనాలకి ఓవినతి చేశాడు.గుడిలో పాలక్యాన్లు పెట్టి కొంతదైవాలకి పాలాభిషేకం చేసి మిగతాపాలు క్యాన్లలో పోయమని బ్రతిమాలి ఒప్పించాడు. దాదాపు 10 ఏళ్ల బట్టి ఆక్యాన్లలోని పాలను కాచి మురికివాడల పిల్లలకు గర్భవతులకు బాలింతలకు వృద్ధులకు పంచుతాడు. గుజరాతీ పెద్ద మనిషి ఆలోచన మంచిదే.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి