బీహార్లో కుగ్రామం హర్దీచౌఘరా!500మంది ఉన్న వారు కర్మకాండలకోసం ఊరంతా భోజనాలు పెట్టి అప్పుల పాలైనారు.కొందరు పల్లెవిడిచి పారిపోయారు.స్వచ్ఛంద సంస్థలు ఓమార్గం చూపాయి. భోజనాలు బదులు బంధువుల తో మొక్కలను నాటించే సాంప్రదాయం ప్రవేశ పెట్టారు.20ఏళ్లుగా ఆవిధానం కొనసాగుతోంది.
రకరకాల చికిత్స లకు తడిసిమోపెడు ఖర్చు.మరి పైసాతీసుకోకుండా ఉచితంగా వైద్యం మందులు అందిస్తున్న ఆసుపత్రి మన తెలంగాణ లోమఠంపల్లి మండలంలోని మట్టపల్లి కొండప్రాంతంలో ఉంది.ఆర్ ఆర్ ఎం హెచ్ హెచ్ హాస్పిటల్ కి తండాజనాలు వస్తారు.డాక్టర్ జిల్లేపల్లి శ్రీహరిరావుగారి కృషి ప్రోత్సాహంతో నడుస్తోంది.ఆయన కేవలం 5_6రోజులే సెలవుపెట్టారు 20ఏళ్ల సర్వీసులో!
మనరైతులు వరదలు తుఫాను నీటికరువుతో పంటను కోల్పోయిగోడుగోడున విలపిస్తున్న రోజులివి.మరి పూల వ్యాపారం కూడా గ్యారంటీలేదు. కానీఆవ్యాపారంతో నవ్వులపువ్వులతో ఆనందిస్తున్నారు తోట యజమానులు.ఒడిశాలోని రలాబా బుల్లి పల్లె.తుఫాన్ దెబ్బ కి తమలపాకు పోకతోటలు సర్వనాశనమైనాయి.అంతే కొత్త పుంత తొక్కారు. రజనీగంధ అంటే లిల్లీపూలతోటలతో ఉపాధి పొందుతున్నారు. అలాగేమహారాష్ట్రలోని పులాంచా అనే పల్లె రోజూ ట్రక్కులకొద్దీ పూలను రవాణాచేస్తోంది. బంతి చేమంతి తో వారిజీవితం పూల దండలా ఘుమఘుమ లాడుతోంది🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి